*ఈ ఏడాది 1,500 మందిని కొత్తగా నియమించుకుంటామని ఎల్ అండ్ టీ తెలిపింది. గతేడాది కూడా ఇంతే సంఖ్యలో నియామకాలు జరిపినట్లు గుర్తు చేసింది. 2018 మార్చి 31కి 42,924 మంది సిబ్బంది ఉన్నారని, అంతకుముందు ఏడాదిలో ఈ సంఖ్య 41,466 అని వివరించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.16,000 కోట్ల వరకు ఆదాయం ఆర్జించాలని టాటా ప్రాజెక్ట్స్ ఆశిస్తోంది.
*బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌ల విలీనం రెండేళ్లలో సంపూర్ణమవుతుందని బీఓబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఈ మూడు బ్యాంకుల విలీనం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
*రిలయన్స్ జియో చందాదార్ల సంఖ్య 30 కోట్లు దాటింది. సేవలు ఆరంభించిన రెండున్నరేళ్లలోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. గతనెల 2న జియో చందాదార్ల సంఖ్య 30 కోట్లకు చేరిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ క్రికెట్ ప్రకటనల్లో జియో ఈ విషయాన్ని ప్రకటిస్తోంది.
*దేశీయ కేపిటల్ మార్కెట్లపై విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) బుల్లిష్ ధోరణి కనబరుస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో వారు ఇప్పటికే రూ.11,096 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి ముందు మార్చి, ఫిబ్రవరి నెలల్లోనూ వరుసగా రూ.45,981 కోట్లు, రూ.11,182 కోట్ల పెట్టుబడులు వారు చొప్పించారు.
* విమానాల సంఖ్య 10 లోపునకు చేరడం, అంతర్జాతీయ – దేశీయ మార్గాల్లో సర్వీసులను భారీగా రద్దు చేయడం, 3 నెలలుగా వేతనాలే ఇవ్వకపోవడంతో జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు, ఇంజినీర్లు సంస్థను వీడి స్పైస్‌జెట్‌లో చేరుతున్నారు. ఇదే అదనుగా జెట్‌లో వీరికి లభిస్తున్న వేతనం కంటే 30-50 శాతం తక్కువ మొత్తాన్నే స్పైస్‌జెట్ ఆఫర్ చేస్తోందని సమాచారం.
జియో వినియోగదారులు 30 కోట్లు-వాణిజ్య-04/15
Related tags :