DailyDose

వివాదంగా మారిన తెలంగాణా ఎమ్మెల్యే పాట–రాజకీయ-04/15

rajasingh song draws controversy

*గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పాడిన పాట వివాదానికి దారి తీసింది. శ్రీరామనవమి సందర్భంగా హిందుస్థాన్ జిందాబాద్ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వ‌యంగా ఓ పాట పాడారు. అయితే ఆ పాట‌ను కాపీ కొట్టార‌ని పాకిస్థాన్ ఆరోపిస్తున్న‌ది. మార్చి 23 పాకిస్థాన్ డే సందర్భంగా తాము రూపొందించిన ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’పాటకు ఇది కాపీ అంటూ పాకిస్థాన్ ఆర్మీ అధికారి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అసిఫ్ గ‌ఫూర్ ట్వీట్ చేశారు.ఈ పాటను పాక్‌కు చెందిన సహిర్‌ అలీ బగ్గా రాసారని తెలియజేశారు. పాట‌ను కాపీ చేయ‌డం సంతోష‌మే అని, కానీ నిజ‌మైన పాట పాడితే బాగుంటుందని ఆ అధికారి ఓ ట్వీట్‌లో చెప్పారు. పాకిస్థాన్ జిందాబాద్ స్థానంలో హిందుస్థాన్ జిందాబాద్ అని పాడుతున్నార‌ని పాక్ అధికారి ఆరోపించారు.
దిల్ కా హిమ్మ‌త్ వ‌త‌న్‌.. అప్నా జ‌జ్‌బా వ‌త‌న్‌. మ‌న్ కీ స‌చ్చీ ల‌గ‌న్‌… సీదా ర‌స్తా వ‌త‌న్ అన్న పాట‌ను రాజా సింగ్ పాడారు. అయితే ఆ పాట త‌మ‌దే అని పాక్ అంటోంది. త‌న పాట‌ను ఆదివారం రిలీజ్ చేయాల‌నుకున్న రాజా సింగ్‌.. పాక్ ఆరోప‌ణ‌లు రావ‌డంతో దాన్ని వాయిదా వేశారు.
*తెదేపా అరాచకాల పై ఈసీకి ఫిర్యాదు – విజయసాయిరెడ్డి
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాలపై ఈసీకి ఫిర్యాదుచేశామని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తెపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..గుంటూరులో శాంతిభద్రతల ఉల్లంఘన..స్వయంగా స్పీకరే ఉద్రిక్తతలు సృష్టించడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కోడెలపై తాము ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే తిరిగి తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.మచిలీ పట్నంలో ఈవీఎం స్ర్టాంగ్ రూమ్ లోపలి దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మరిన్ని కేంద్ర బలగాల భద్రత పెంచాలని ఈసీని కోరినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో నారాయణ, చైతన్య సంస్థల సిబ్బంది ఉన్నారు. విజయనగరం, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో శాంతి భద్రతల ఉల్లంఘన జరిగిందన్నారు. రాష్ట్రానికి అదనపు బలగాలను కేటాయించాలని కోరినట్లు చెప్పారు.ఆర్టీసీ కార్మికులకు, ఆశావర్కర్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని ఈసీని కోరినట్లు చెప్పారు.
*నాపై దుష్ప్రచారం:డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు
తన ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్‌ సతీమణి, వైకాపా నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను అగౌరవ పరుస్తూ విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. డీజీపీని కలిసిన అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 4వ తేదీన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఓ టీవీ ఛానల్‌, సోషల్‌ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కోటి కించపరిచారని ఆమె మండిపడ్డారు. అతనితో పాటు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీడియా ఛానల్‌‌, యాంకర్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు లక్ష్మీపార్వతి తెలిపారు.
* 26వ తేదీన ప్రధాని మోదీ నామినేషన్
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలుకు ముహుర్తం ఖరారైంది. వరుసగా రెండోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్న మోదీ.. ఈ నెల 26వ తేదీన తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. రెండు రోజుల పాటు వారణాసిలో ఆయన పర్యటించనున్నారు. 25వ తేదీన బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి దశ్‌అశ్వమేథ్ ఘాట్ వరకు నిర్వహించే రోడ్‌షోలో మోదీ పాల్గొననున్నారు. అనంతరం కాల భైరవ ఆలయానికి మోదీ వెళ్లనున్నారు. అదే రోజు పార్టీ కార్యకర్తలతో మోదీ సమావేశం కానున్నారు. 26న కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు మోదీ. అక్కడ్నుంచి రోడ్ షో పాల్గొని అనంతరం మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
* యోగీ, మాయావతీ పై ఈసీ షాక్
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా… ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించింది. ఎలక్షన్‌ కమిషన్‌కు తక్కువ అధికారాలు ఉన్నాయనడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయ స్థానం… రేపు తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సీఈసీని ఆదేశించింది. ఈ సందర్భంగా మాయావతి, యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించింది సుప్రీం కోర్టు. నాయ్యస్థానం ఆవేశాలపై స్పందించిన ఈసీ యోగి ఆదిత్యనాథ్, మాయావతిల ప్రచారంపై తాత్కలిక నిషేదం విధించింది. మాయావతి ప్రచారంపై 48 గంటలు,యోగి ఆదిత్యానాథ్ ప్రచారం పై 72 గంటల పాటు నిషేధం విధుస్తున్నట్లు తెలిపింది.* ప్రధాని వెంట నల్ల ట్రంకు పెట్టె?
ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు రక్షణగా వచ్చిన మూడు హెలికాప్టర్లలోని ఒక దాని నుంచి అనుమానాస్పదంగా తరలించిన నల్లట్రంకు పెట్టెలో ఏముందో నిగ్గుతేల్చాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. మోదీ కూడా తన స్వచ్ఛతను నిరూపించుకోవాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ ఆదివారం దిల్లీలో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఒక వీడియో క్లిప్‌ను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఆ పెట్టెలో నగదు తరలించి ఉండవచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘‘కర్ణాటకలోని చిత్రదుర్గ్‌కు ప్రధాని మోదీ హెలికాప్టర్‌కు రక్షణగా మూడు హెలికాప్టర్లు రావటం చూశాం. అవి కిందికి దిగిన తర్వాత ఒక నల్లట్రంకు పెట్టెను హడావిడిగా బయటకు తరలించి దూరంగా ఉన్న ఒక కారులోకి చేర్చారు. ఆ కారు ప్రత్యేక రక్షణ బృందం(ఎస్‌పీజీ)లోని వాహనాలకు దూరంగా ఉంది’’ అని ఆనంద్‌ శర్మ తెలిపారు. ఈనెల 9న ప్రధాని మోదీ చిత్రదుర్గ్‌లో భాజపా నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ప్రధానికి చెందిన వాహనాల్లో సైతం తనిఖీలు జరిపే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుందని శర్మ గుర్తు చేశారు. నల్లట్రంకు పెట్టె ఉదంతంపై దర్యాప్తు జరిపించాలని కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆయన వెల్లడించారు.
*వయనాడ్ బరిలో మరో ముగ్గురు గాంధీలు
కర్ణాటకలోని మాండ్యా స్థానం బరిలో దిగిన సినీనటి సుమలతతో పాటు అదే పేరున్న మరో ముగ్గురు నామినేషన్ వేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు రాహూల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ లోనూ ఇదే పరిస్థితి రాహూల్ గాంధీ నామినేషన్ వేశాక అదే పేరున్న మరో ముగ్గురు అభ్యర్ధులు వయనాడ్ బరిలో తలపడటానికి సిద్దమయ్యారు. కొట్టాయంకు చెందిన ముప్పై మూడేళ్ళ కే.ఈ.రాహూల్ గాంధీ కోయంబత్తూరుకు చెందిన ముప్పై ఎల్లా కే. రఘుల్ గాంధీ త్రిశూర్ కు చెందిన నలభై ఏళ్ల కే.ఎం.శివప్రసాద్ గాంధీలు వయనాడ్ స్థానం నుంచి నామినేషన్లు వేశారు. కే.ఈ.రాహూల్ గాంధీ భాషలు, సామాజిక సేవ అనే అంశాల్లో పీహెచ్డీ చేశారు. భార్య గృహిణి వీరికి అప్పులు స్థిర చరాస్తులు ఏమీ లేవు. చేతిలో ఐదు వేల రూపాయలు బ్యాంకులో 515 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కే. రఘుల్ గాంధీ రిపోర్టర్ ఆయన భార్య దంతవైద్యురాలు ఆయన భార్య రెండు లక్షల తొంభై తొమ్మది వేల రూపాయల జీతం అందుకుంటున్నట్టు ఆద్యప పన్ను వివరాలు అప్పున్నట్టు పత్రాలు సమర్పించారు. వీరిరువురురికి 1,45,000 రూపాయల అప్పున్నట్టు పత్రాలు సమర్పించారు. కే.ఎం.శ్యాం ప్రసాద్ గాంధీ సంస్కృతం ఉపాద్యాయుడు అతని భార్య కంప్యూటర్ ఉద్యోగిని వీరు ఉన్నత కుటుంబానికి చెందిన వారే.
*అహ్మదాబాద్ తూర్పు బరిలో భార్యా బాధితుల సంఘం నేత
మనదేశంలో ప్రత్యెక చట్టాలు కేవలం స్త్రీలకే ఎందుకు? మహిళా కమిషన్ తరహాలో పురుషుల కమిషన్ ను ఎందుకు ఏర్పాటు చేయరు? భార్యాదితుల సంఘం ప్రతినిధులు తరచూ లేవనెత్తే ప్రశ్నలివి. ఇకపై ఈ ప్రశ్నలను నేరుగా పార్లమెంటులోనే సందిస్తానంతున్నారు దశరద్ దేవడా. అఖిల భారత భార్యాబాదితుల సంఘం అద్యక్షుడాయన తూర్పు అహ్మదాబాద్ నియోజకవర్గం నుంచి దసరాద్ ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. జోరుగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. తనని గెలిపిస్తే మహిళలతో సమానంగా పురుషులకు హక్కులు కల్పించెండునుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. పురుషుల సంక్షేమం కోసం ప్రత్యెక కమిషన్ ఏర్పాటయ్యేలా చూస్తానని కూడా చెబుతున్నారు. దశరద్ 2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. లోక్ సభకు పోటీ చేసునప్పుడు 2300 ఓట్లు రాగా అసేమ్బ్లీకు ఎన్నికల్లో 400 ఓట్లు సాధించారు.
* అయినా వాళ్లు ఓటేస్తున్నారు
న్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఊరూ వాడా తిరిగి ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థిస్తుంటారు. తమిళనాడు రాష్ట్రంలోని కదంబూర్‌ కొండలలో ఉన్న ఒక గిరిజన కుగ్రామంలో మాత్రం ఎటువంటి ఎన్నికల ప్రచారం కనిపించదు. అయినా ఆ గ్రామ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ ఓటు హక్కు వినియోగించుకోవటం మానరు. మలియమ్మన్‌ దుర్గం నీల్‌గిరీస్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని భవానీసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ గ్రామం ఉంది. అక్కడకు చేరుకోవాలంటే అడవి మార్గమే దిక్కు. ఆ గ్రామంలో 421 మంది ఓటర్లు ఉన్నారు. ‘మా గ్రామానికి నాయకులు రారు. కనీసం ప్రచారం వేళ కూడా మా వైపు చూడరు. ఊరు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎప్పటికైనా పట్టించుకుంటారనే ఆశతో మేమే ప్రతిసారీ ఓటేస్తుంటాం’ అని చెబుతున్నారు గ్రామస్థులు. ‘సత్యమంగళం పులుల సంరక్షణ కేంద్రం ఉన్నందున గ్రామానికి రోడ్లు వేయలేదు. ఇప్పటికీ గర్భిణులు, రోగులు ఆసుపత్రికి వెళ్లాలంటే ఊయల, కట్టెలపై మోస్తూ రెండు గంటల పాటు కాలినడకన వెళ్లాల్సిందే. ఐదు నెలల క్రితం సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి మూడు బల్బుల శక్తికి మాత్రమే సహాయపడుతుంది. కానీ ఫోన్లు ఛార్జ్‌ చేయలేము’ అని ఆ గ్రామ మొదటి గ్రాడ్యుయేట్‌ అంటున్నారు. అక్కడి ప్రజలకు తారు రోడ్డు రాదని తెలుసు! కనీసం ద్విచక్ర వాహనం వెళ్లేంత రోడ్డైనా వేయమని కోరుతున్నారు. గ్రామంలోని చాలా తరాలు కనీస అభివృద్ధిని కూడా చూడకుండానే కన్నుమూస్తున్నారని వాపోతున్నారు.
* ఐదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
తెలంగాణ శాసన మండలిలో ఐదుగురు కొత్త సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. తెరాసకు చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గే మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజ్‌ హసన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి హాజరయ్యారు.
* రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రఫేల్‌ వివాదంపై సుప్రీంకోర్టు ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాహుల్‌ పేర్కొన్నారని, తన అభిప్రాయాలను న్యాయస్థానానికి ఆపాదిస్తున్నారని ఆరోపిస్తూ భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ మీడియాలో అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. దీనిపై ఈ నెల 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
* ఆ ఓటింగే మా విజయానికి సూచిక: గంటా
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 125 శాసనసభ నియోజకవర్గాల్లో విజయం సాధించనుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తంచేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు అర్ధరాత్రి వరకూ వేచి ఉండి ఓటు వేయడం తమ పార్టీ విజయానికి సూచికగా గుర్తిస్తామన్నారు. పోలింగ్‌ రోజున ఓటర్ల స్పందన ప్రజాస్వామ్యంపై వారి బాధ్యతకు నిదర్శనమని కొనియాడారు. పోలింగ్‌ కేంద్రాల్లో 20 నుంచి 30 శాతం వరకు ఈవీఎంలు ప్రారంభంలో పనిచేయలేదని గంటా అన్నారు. ఉత్తర నియోజకవర్గంలో 37వ వార్డు 209 బూత్‌లో అర్ధరాత్రి రెండు గంటల వరకూ ఓటింగ్‌ జరిగిందన్నారు.
* రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రఫేల్‌ వివాదంపై సుప్రీంకోర్టు ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాహుల్‌ పేర్కొన్నారని, తన అభిప్రాయాలను న్యాయస్థానానికి ఆపాదిస్తున్నారని ఆరోపిస్తూ భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ మీడియాలో అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. దీనిపై ఈ నెల 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
*కన్నడనాట నేడు చంద్రబాబు ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాంగ్రెస్‌, జనతాదళ్‌ మిత్రపక్షాల అభ్యర్థి, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్‌ కుమారస్వామి తరఫున మండ్యలో ఆయన ప్రచారం చేస్తారు. మండ్య జిల్లా పాండవపురలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సినీ నటి, దివంగత కన్నడ నటుడు అంబరీశ్‌ సతీమణి సుమలత పోటీ చేస్తున్నారు. సుమలతకు భాజపా భేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
*మేధావుల మౌనంతో సమాజానికి చేటు
మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి చెడు జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో చట్టం, న్యాయం, రాజ్యాంగం ఏదీ పని చేయదని…ఒక నియంత రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. పీసీసీ ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ తదితరులు నివాళులు అర్పించారు.
*నేను ఎవరికీ తలవంచను
దేశాన్ని ఎవరు విభజించాలని ప్రయత్నించినా తాను చూస్తూ ఊరుకోబోనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మోదీ అమ్ముడుపోడు, దేనికీ భయపడడు. ఎవరికీ తలవంచడు’’ అని చెప్పారు. జమ్ము-కశ్మీర్‌ను మూడు తరాలుగా అబ్దుల్లా, ముఫ్తీల కుటుంబాలు నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఆ కుటుంబాలను ఎన్నికల్లో ఓడించి దూరం పెట్టాలని అన్నారు. వారు దేశాన్ని విభజిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆ కుటుంబాల సభ్యులంతా వచ్చి మోదీని కావలసినన్ని తిట్లు తిట్టుకోవచ్చని, కానీ దేశాన్ని మాత్రం విభజించలేరని చెప్పారు. ఆదివారం జమ్ము-కశ్మీర్‌లోని కథువా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. దేశ విభజనకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
*ప్రణాళిక ప్రకారమే కోడెలపై దాడి?
సార్వత్రిక ఎన్నికల రోజున గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో సభాపతి, సత్తెనపల్లి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై వైకాపా శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం ఇనిమెట్లలో అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా దాడుల్లో ఇతర గ్రామాల వారు పాల్గొన్నట్లు తెలిసింది. 200 మందికి పైగా కార్యకర్తలు దాడిలో పాల్గొనగా వారిలో స్థానికేతురులైన రామిరెడ్డిపేటకు చెందిన 20మంది, చీమలమర్రికి చెందిన ఏడుగురు వ్యక్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడులు జరిగిన సమయంలో వైకాపా మండల స్థాయి నేతకు చెందిన కారు ఆ ప్రదేశానికి సమీపంలో ఉండటాన్ని కొందరు పోలీసులకు తెలియజేశారు. దీంతో పక్కా ప్రణాళికతోనే దాడులకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*ఈవీఎంలపై బాబుది అనవసర రాద్ధాంతం
ఏపీలో చంద్రబాబు తీరును బట్టి తెదేపా కార్యకర్తలు కూడా ఓటమి తప్పదని అంగీకరిస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘తెలంగాణలో ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో దేశమంతా చూసింది. ఏపీలో హత్యలు, దొమ్మీలు జరిగాయి. తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు తెరాస పాలనకు అద్దం పడుతోంది. ఏపీలో ఎన్నికల తీరు వాళ్ల పాలన ఎలా ఉందో చెబుతోంది. ఏపీలో రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం మారిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? అక్కడి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర్‌రావు ఎలాంటివారో, ఏం చేశారో అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఒక పత్రికలో జాహ్నవి పేరుతో వ్యాసాలు రాశారు.
*మోదీ మళ్లీ ప్రధాని కాలేరు
మోదీ మళ్లీ ప్రధాని అవుతారని తాను నమ్మడం లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. నాటి ఎన్డీయే పాలనలో తాను వాజపేయీతో కలిసి పని చేశానని, సమర్థ ప్రధానిగా ఆయన నిరూపించుకున్నారన్నారు. ఆయనతో మోదీని పోల్చలేమని, మోదీ చెప్పింది చేయలేదని, రైతులు, యువత ఉపాధికి చేసిందేమీ లేదని చెప్పారు.
*మోదీవి మురికి రాజకీయాలు
జలియన్‌వాలాబాగ్‌ కన్నీటి ఘటన జరిగి వందేళ్లయిన సందర్భంగా అమృతసర్‌లో నివాళి కార్యక్రమాలు చేపట్టాలని పంజాబ్‌ ప్రభుత్వం ఎంతగానో యత్నించినప్పటికీ కేంద్రం ఏమాత్రం సహకరించలేదని సీఎం అమరీందర్‌సింగ్‌ ఆదివారం ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మోదీ ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందని అన్నారు. ఇప్పుడు తమపై విమర్శలకు దిగుతూ ప్రధాని మోదీ మురికి రాజకీయాలకు పాల్పడుతున్నారని అమరీందర్‌సింగ్‌ విమర్శించారు. నివాళి కార్యక్రమంపై కూడా మోదీ రాజకీయం చేస్తున్నారన్నారు. జలియన్‌వాలాబాగ్‌ ట్రస్ట్‌కు ప్రధానమంత్రే చైర్మన్‌గా ఉన్న నేపథ్యంలో తాను అన్ని పర్యాయాలు కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇంత జరిగాక… ఆ కార్యక్రమాన్ని తాను బహిష్కరించానంటూ నరేంద్రమోదీ విమర్శలకు దిగడాన్ని ఖండించారు.
*మోదీకి ప్యాంటు వేసుకోవడం రాకముందే…
మనదేశానికి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ రక్షణ బలగాలను ఏర్పాటు చేసేనాటికి నరేంద్ర మోదీ పైజామా, ప్యాంట్లు వేసుకోవడం కూడా నేర్చుకోలేదు. ఇప్పుడొచ్చి దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్లక్రితం కూడా దేశం సురక్షితంగానే ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక మునుపెన్నడూ జరగనన్ని ఉగ్రవాద దాడులు జరిగాయి. 2001లో పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగినప్పుడు అధికారంలో ఉంది మీ పార్టీ కాదా?
*ఆ రెండు స్తంభాలపై నిలబడిన కేంద్ర ప్రభుత్వం
సహజ వనరులను దోచుకోవడం, పేదలను మరిన్ని కష్టాలపాల్జేయడం అనే రెండు స్తంభాలపై మోదీ ప్రభుత్వం నిలబడింది. ఓటమి తప్పదని అర్థమై, ఓట్లు పొందడానికి భద్రతా దళాలను చూసి ఓటేయమని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రచారం చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలను చూస్తే, ఎన్నికల తరువాత లౌకికవాద ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని స్పష్టమవుతోంది. గత ఐదేళ్లలో రూ.5.5లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు మాఫీ చేశారని ఇటీవల ఓ నివేదిక చెబుతోంది. ఎన్నికల బాండ్ల రూపంలో భాజపాకు ఎలా నిధులందుతున్నాయో అర్థమవుతోంది. ఎవరి రుణాలు మాఫీ చేశారో పేర్లు వెల్లడించాలి.
*ఈవీఎంలపై నమ్మకం పెంచే చర్యలు తీసుకోండి: సీపీఐ
కోయంబత్తూర్‌: ఓటర్లలో నమ్మకం కలిగేలా ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)లను నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంపై ఆయన స్పందించారు. దేశంలో ఇంకా ఆరు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈవీఎంలపై విశ్వసనీయత పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
*ప్రతి స్థానం గెలవాల్సిందే
తెలంగాణలోని ప్రతి జడ్పీటీసీ, ఎంపీటీసీని గెలవాలనే లక్ష్యాన్ని పార్టీ శ్రేణులకు తెరాస అధిష్ఠానం నిర్దేశించనుంది. దీని కోసం తెలంగాణభవన్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. సీఎం కేసీఆర్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. రెండు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల కోసం జరిగిన సమావేశం అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల కోసం మళ్లీ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
*ప్రధాని వెంట నల్ల ట్రంకు పెట్టె?
ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు రక్షణగా వచ్చిన మూడు హెలికాప్టర్లలోని ఒక దాని నుంచి అనుమానాస్పదంగా తరలించిన నల్లట్రంకు పెట్టెలో ఏముందో నిగ్గుతేల్చాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. మోదీ కూడా తన స్వచ్ఛతను నిరూపించుకోవాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ ఆదివారం దిల్లీలో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఒక వీడియో క్లిప్‌ను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఆ పెట్టెలో నగదు తరలించి ఉండవచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
*ప్రతి స్థానం గెలవాల్సిందే
తెలంగాణలోని ప్రతి జడ్పీటీసీ, ఎంపీటీసీని గెలవాలనే లక్ష్యాన్ని పార్టీ శ్రేణులకు తెరాస అధిష్ఠానం నిర్దేశించనుంది. దీని కోసం తెలంగాణభవన్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. సీఎం కేసీఆర్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. రెండు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల కోసం జరిగిన సమావేశం అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల కోసం మళ్లీ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
*కాంగ్రెస్‌లోకి జడేజా తండ్రి, సోదరి
క్రికెటర్‌ రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్‌ సింహ్‌, సోదరి నైనాబా ఆదివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో పాటేదార్‌ నేత హార్థిక్‌ పటేల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గత నెలలో జడేజా భార్య భాజపాలో చేరిన విషయం విదితమే.
*‘గూర్ఖాల్యాండ్‌’ పరిశీలనకు భాజపా హామీ: బిమల్‌ గురుంగ్‌
కేంద్రంలో మళ్లీ తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక గూర్ఖాల్యాండ్‌ డిమాండ్‌ను పరిశీలిస్తామంటూ భాజపా హామీ ఇచ్చినట్లు గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) నేత బిమల్‌ గురుంగ్‌ తెలిపారు. గూర్ఖాల్యాండ్‌ అనేది ఇక్కడి కొండ ప్రాంతాల్లోని ప్రతి గూర్ఖా కల అని.. దీనికి రాజకీయ పరిష్కారం చూపుతామంటూ కమలదళం హామీ ఇచ్చినట్లు చెప్పారు.
*కేంద్రమంత్రి కుమారుడికి భాజపా టికెట్‌
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌధరి బీరేంద్ర సింగ్‌ కుమారుడు బ్రిజేంద్రకు హరియాణాలోని హిసార్‌ స్థానాన్ని కేటాయిస్తూ భాజపా నిర్ణయం తీసుకొంది. ఆయనతో పాటు లోక్‌సభకు పోటీ చేయనున్న మరో అయిదుగురు అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. హరియాణాకు చెందిన ఇద్దరు, రాజస్థాన్‌కు చెందిన ఒకరు, మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పేర్లను విడుదల చేసింది.
*మోడీ మళ్ళీ ప్రధాని కాలేరు
మోదీ మళ్లీ ప్రధాని అవుతారని తాను నమ్మడం లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. నాటి ఎన్డీఏ పాలనలో తాను వాజపేయీతో కలిసి పని చేశానని, సమర్థ ప్రధానిగా ఆయన నిరూపించుకున్నారన్నారు. ఆయనతో మోదీని పోల్చలేమని, మోదీ చెప్పింది చేయలేదని, రైతులు, యువత ఉపాధికి చేసిందేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఇంకా పరిపక్వత రాలేదని, ఆయన నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకుంటే బిజద ఎవరి పక్షాన నిలుస్తుందన్న ప్రశ్నకు… రాష్ట్ర ప్రయోజనాలే కీలకమని, వాటిని నెరవేర్చే వారికే మద్దతు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌ కూటమికైనా సహకరిస్తారా? అని అడగ్గా.. తమకు పార్టీ ముఖ్యం కాదని, ఒడిశాను ఆదుకునే వారికి సహకరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జమిలి ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో నవీన్‌ పట్నాయక్‌ బస్సులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
*ఈవీఎం లపై బాబుది అనవసర రాద్దాంతం
ఏపీలో చంద్రబాబు తీరును బట్టి తెదేపా కార్యకర్తలు కూడా ఓటమి తప్పదని అంగీకరిస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘తెలంగాణలో ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో దేశమంతా చూసింది. ఏపీలో హత్యలు, దొమ్మీలు జరిగాయి. తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు తెరాస పాలనకు అద్దం పడుతోంది. ఏపీలో ఎన్నికల తీరు వాళ్ల పాలన ఎలా ఉందో చెబుతోంది. ఏపీలో రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం మారిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? అక్కడి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర్‌రావు ఎలాంటివారో, ఏం చేశారో అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఒక పత్రికలో జాహ్నవి పేరుతో వ్యాసాలు రాశారు. ఆయనకు బాబు వకాల్తా పుచ్చుకోవడం సిగ్గుచేటు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దిగజారి మాట్లాడారు. కేసీఆర్‌, జగన్‌లు మోదీ పెంపుడు కుక్కలని అన్నారు. నాలుగేళ్లు మోదీతో అంటకాగిన చంద్రబాబును పెంపుడు కుక్క అని మేము అనలేమా? మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము అలా మాట్లాడం. కేసీఆర్‌, జగన్‌ హుందాగా వ్యవహరించారు. ప్రజలపట్ల నమ్మకం లేకే బాబు దిల్లీలో వీధినాటకాలు ఆడుతున్నారు. ప్రజాతీర్పును స్వాగతించాలి కానీ ఇలా గగ్గోలు పెట్టొద్దు. ఈవీఎంలపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. 2014లో ఇదే ఈవీఎంలతో గెలిచిన విషయాన్ని ఆయన మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఒకవేళ గెలిస్తే ఈవీఎంల గురించి ఏం మాట్లాడుతారు? గెలిస్తే సాంకేతికత భేష్‌ అని, లేకపోతే ఈవీఎంల తప్పు అనడం సరికాదు. 40ఏళ్ల అనుభవమని చెప్పుకుంటున్న వ్యక్తి ఇంత చిల్లర అరుపులు ఎందుకు అరుస్తున్నారో అర్థం కావడంలేదు’’ అని పేర్కొన్నారు.
* కేసీఆర్‌, జగన్‌లకు త్వరలో రిటర్న్‌ గిఫ్ట్‌
కేసీఆర్‌, జగన్‌లకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వనున్నారని తెదేపా నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు. తెదేపా 150 స్థానాలకు పైగా గెలవబోతున్నట్లు వెల్లడించారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తెదేపా ప్రభుత్వమేనని, ఈ సారి జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ, జగన్‌, కేసీఆర్‌లు కలిసి చేస్తున్న కుట్రల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు పోరాటం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీసీలకు తెరాస అడుగడుగునా అన్యాయం చేసినా నోరుమెదపని తలసాని శ్రీనివాస యాదవ్‌.. కేసీఆర్‌ దగ్గర మార్కులు కొట్టేసేందుకు జగన్‌ను వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓటర్ల జాబితాను తారుమారు చేసి అధికారంలోకి వచ్చిన తెరాస నేతలు చంద్రబాబు పనితీరును విమర్శించడం ఏమిటని నిలదీశారు.
*భాజపాపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
‘దేశ స్వాతంత్య్రం గురించి ప్రధాని నరేంద్ర మోదీ కన్నా నాకే ఎక్కువ తెలుసు.. స్వాతంత్య్రం వచ్చే నాటికి మోదీ పుట్టనే లేదు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని యాదగిరిలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన భాజపా, మోదీలపై విమర్శలు గుప్పించారు.
*ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క డిమాండ్‌ చేశారు. ఆదివారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో భట్టి కలిశారు. అనంతరం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.