DailyDose

విశాఖ బీచ్‌లో రేవ్ పార్టీ కలకలం–నేరవార్తలు–04/15

rave party in vizag beach

* విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో జరిగిన ఓ రేవ్ పార్టీ కలకలం రేపింది. బీచ్ రోడ్ కు సమీపంలో ఓ హోటల్ పరిసరాల్లో ఈ పార్టీని నిర్వహించినట్టు తెలిసింది. ఎవ్వరికి తెలియకూడదని గుట్టుగా నిర్వహించిన ఈ పార్టీలో… మద్యం, గంజాయి మత్తులో అమ్మాయిలు, అబ్బాయిలు ఊగిపోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకూ.. మ్యూజిక్ హోరుతో తాగి ఊగారు. యువత, విద్యార్థులే లక్ష్యంగా చేసుకుని నిర్వాహకులు ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టు సమాచారం. అర్థరాత్రి వేళ ఆ డీజే హోరుతో విసిగిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు… నిర్వాహకుల లాబీయింగ్‌తో వెనుదిరిగారు. ఇందులో టీడీపీ నేత కుమారుడి పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
*ఓ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు శరవేగంతో దూసుకుపోతున్నారు. ఆ బైక్ సైలెన్సర్‌పై ఉన్న బట్టల సంచికి మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన పోలీసులు.. తమ వాహనంతో ఆ బైక్‌ను ఛేజ్ చేసి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన యూపీలోని ఇటవా హైవేపై చోటు చేసుకుంది. పోలీసులు తమ వాహనంలో వెళ్తూ బైక్‌కు మంటలు అంటుకున్నాయి.. ఆపండి అంటూ ఆ ఇద్దరిని అప్రమత్తం చేశారు. దీంతో ఒక్కసారిగా బైక్‌ను ఆపి వారు పరుగులు పెట్టారు. పోలీసులు బైక్‌కు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు
*తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు గ్రామంలోని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ అధికారి బాలికలు ఇద్దరు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీకి చెందిన వినీత్ అగర్వాల్ మిలట్రీ అధికారి గా పని చేస్తున్నారు. ఈయన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి కారులో కోల్ కతాకు పయనమయ్యారు. ఆదివారం ఆయన భార్య సుభాయ్, ఇద్దరు కుమార్తెలు రాధికా అగర్వాల్ రితికా అగర్వాల్ కారులో రాజమహేంద్రవరం స్నేహితుడితో ఇంట్లో ఆగి తిరిగి వెళ్తుండగా వీరి కారు ధర్మవరం గ్రామ జోడుగడ్ల వాగు సమీపాన ఆగి ఉన్న కంటైనర్ డీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న అగర్వాల్ వెనుక సీటులో ఉన్న భార్య సుభాయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముందు, వెనుక సీట్లలో ఓ వైపు కూర్చున్న కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలను ప్రత్తిపాడు సిహెచ్సీకి తరలించారు. సంఘటనా స్థలాన్ని జగ్గంపేట సిఐ వై.రాంబాబు , ప్రత్తిపాడు ఎస్సై ఎ.బాలాజీ పరిశీలించారు. ఆర్మీ అధికారి పదోన్నతి పై కోల్ కతాకు కుటుంబంతో కలిసి వెళ్తున్నట్టు తెలిసింది.
* కడప జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో కోటి రూపాయలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. రెండు చోట్లా రైతులకు సంబంధించిన విలువైన పంట అగ్నికి ఆహుతవ్వడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు.
* ఆజంఖాన్ తనపై పోటీ చేస్తున్న బీజేపీ నాయకురాలు, నటి జయప్రదపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె లోదుస్తులు ఫలాన రంగులో ఉన్నాయంటూ ఆదివారం ఎన్నికల సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్‌పై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయనకు త్వరలోనే నోటీసులు పంపనున్నామని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్శ ఇప్పటికే తెలిపారు.ఐతే తాను బీజేపీ అభ్యర్థి జయప్రదను ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని సోమవారం ఆజంఖాన్ వివరణ ఇచ్చారు. ఎస్పీ తరఫున జయప్రద గతంలో పదేళ్లపాటు రాంపూర్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆమె అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచారు.
* యశ్వంత్‌పూర్‌- ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లు దోచుకున్నారు. ఈ చోరీపై కాజీపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు .. మత్తు మందు ఎఫెక్ట్‌తో అస్వస్థతకు గురైన వారిని వరంగల్ MGM ఆస్పత్రికి తరలించారు.బెంగళూరు నుంచి బయలుదేరే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ మీదుగా హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తుంది. ఐతే.. ప్రయాణికులకు ధర్మవరం దాటాక మత్తుమందు ఇచ్చి వీళ్లను దొంగలు దోచుకున్నారు. కాస్త తెలివి వచ్చాక.. దోపిడీపై కాజీపేటలో ఫిర్యాదు చేశారు. 15 వేల నగదు, 4 సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్టు చెప్తున్నారు.
* హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లావణ్య హత్య కేసు చిక్కుముడి వీడింది. ప్రియుడు సునీలే చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మస్కట్ వెళ్తున్నామని చెప్పి, ఇంటి నుంచి లావణ్యను తీసుకొచ్చిన సునీల్..‌ లావణ్యను హత్య చేసి, సూట్‌ కేసులో పెట్టి సూరారంలో వదిలేసి వెళ్లిపోయాడు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సునీల్‌ను అరెస్ట్‌ చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.రామచంద్రాపురం LI 922లో నివాసముండే శ్రీనివాస్ దంపతుల కుమార్తె లావణ్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. నల్లమల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నప్పుడు ఆమెకు బీహార్ కు చెందిన సునీల్‌ తో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. ఈ విషయం లావణ్య వాళ్ల ఇంట్లో కూడా తెలుసు. ఇటీవల మస్కట్‌ కు వెళ్తున్నామని లావణ్యను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు సునీల్. అయితే సునీల్‌, లావణ్య మస్కట్ వెళ్లలేదు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది లావణ్య. ఇటు ఇంటికి తిరిగి రాక, అటు మస్కట్‌ వెళ్లక పోవడంతో కూతురు విషయంలో ఏదో జరిగిందని శ్రీనివాస్ అనుమానించాడు. ఈ నెల 7న కూతురు తప్పిపోయినట్టు ఆర్సీపురం పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. లావణ్యను సునీల్‌ తీసుకెళ్లిన విషయం కూడా పోలీసులకు చెప్పాడు శ్రీనివాస్‌. దీంతో పోలీసులు సునీల్ ను తమ దైన స్టైల్‌లో విచారించే సరికి లావణ్య హత్య విషయం బయటపడింది.
* చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం లో ఘటన
. వివరాలు పుంగనూరు మండలం ధర్మవరం పల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప రెడ్డి కుమార్తె మహాలక్ష్మి ఎం సి వి డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదువుతున్నది. సోమవారం ఉదయం గ్రామం నుండి పుంగనూరు ఎం సి వి డిగ్రీ కళాశాలకు అన్నతో కలిసి ద్విచక్ర వాహనంలో వస్తుండగా పట్టణానికి సమీపంలో ఉన్న తోపు మఠం వద్ద మదర్ తెరిసా స్కూల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అన్నా,చెల్లెలు కు తీవ్ర గాయాలయ్యాయి.వీరిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు.
* జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి.. మరో వ్యక్తిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి.. సీటు కింద నుంచి గొడ్డలి తీసి.. మరో వ్యక్తిపై దాడి చేశాడు. దాదాపు  సార్లు అతడిపై గొడ్డలితో దాడి చేయడంతో కడుపుతలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని తిప్పర్తి కిషన్‌గాదాడి చేసిన వ్యక్తిని కత్రోజు లక్ష్మణ్‌గా పోలీసులు గుర్తించారు. లక్ష్మణ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ గొడవకు భూతగాదాలే కారణమని తెలుస్తోంది.
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ పెట్టిన పోస్టింగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా కార్యకర్త ఒకరు హైదరాబాద్ లో బాచుపల్లి టాణాలో ఆదివారం ఫిర్యాదు చేశారు. రామగోపాల్ వర్మ తన పేస్ బుక్ ట్విట్టర్ ఖాతాల్లో చంద్రబాబుని అవమానిచేలా ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్తిందులు పెట్టారని బచిపల్లి మా విలాస్ కాలనీకి చెందిన దేవివీర వెంకట సత్యనారాయణ చౌదరి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
*దేశ స్వాతంత్ర్య గురించి ప్రధాని నరేంద్ర మోడీ కన్నా నాకే ఎక్కువ తెలుసు స్వాతంత్ర్యం వచ్చే నాటికీ మోడీ పుట్టనేలేదు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని యదగిరిలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన భాజపా మోదీలపై విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందే కాంగ్రెస్ వాళ్ళు. బ్రిటిష్ పాలన నుంచి దేశ విముక్తి కోసం భాజపా నేతలు ఇంటి కుక్క కూడా ప్రాణత్యాగం చేయలేదు. మోడీ నుంచి పోరాట పాటలు చెప్పించుకోవాల్సిన అవసరం చేయలేదు. ప్రజాభిమానంతో పదకొండు సార్లు గెలుపు సాధింకాహ నాపై పోటీ చేసి ఓడినవారే నన్ను ఓడించే యత్నం చేస్తున్నారుఅని ఖర్గే వ్యాఖ్యానించారు.
*ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో దర్శకుడు రాంగోపాల్‌వర్మ పెట్టిన పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా కార్యకర్త ఒకరు హైదరాబాద్‌లోని బాచుపల్లి ఠాణాలో ఆదివారం ఫిర్యాదు చేశారు.
*అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో తహసీల్దారు విష్ణువర్దన్‌రెడ్డి (42) అక్కడికక్కడే మృతి చెందారు.
*తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం కల్నల్‌ దంపతులకు కడుపుకోత మిగిల్చింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జరిగిన ఘటనలో వారి ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు.
*తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాకినాడలోని తారకరామనగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన చోడిపల్లి జగన్నాథం(45) అత్యాచారానికి పాల్పడ్డాడు.
* కుమురం భీం జిల్లా జైనూరు మండలం మాన్కుగూడ పంచాయతీ కర్ణంగూడ గ్రామానికి చెందిన తుమ్ర యాదవ్‌రావు (20) అనే గిరిజన విద్యార్థి ఆదివారం సాయంత్రం పిడుగుపాటుతో మృతి చెందాడు.
*యశ్వంత్‌పూర్‌ నుంచి న్యూదిల్లీ వెళ్లే సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు శీతల పానీయాల్లో మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడిన ఘటనిది.
*సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో వడదెబ్బకు ఆదివారం ఇద్దరు మృత్యువాతపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూర్‌ గ్రామానికి కర్రె పోచయ్య (42), మెదక్‌ జిల్లా మెదక్‌ రూరల్‌ మండలం గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన కొరటి పెంటయ్య (60)లు వడదెబ్బకు గురై మృతి చెందారు.
*ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ దంపతులు తమ మూడున్నరేళ్ల పాపను హైటెక్స్‌ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు. రోజూ మాదిరిగా ఈ నెల 10న కూడా చిన్నారి పాఠశాలకు వెళ్లింది.
*ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు.. యువతి, ఆమె తల్లిపై స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
*మద్య నిషేధం అమలులో ఉన్న మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో మద్యాన్ని తరలించేందుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. శనివారం అర్ధరాత్రి చంద్రపూర్‌ మూల్‌ మార్గంలో మినీ వ్యాన్‌ను తనిఖీ చేయగా వాహనం ఖాళీగా కనిపించింది. చోదకుడు పారిపోయాడు. క్షుణ్నంగా పరిశీలించగా వాహనంలో ఇనుపబద్దల అరలు ఏర్పాటు చేసి మద్యం రవాణా చేస్తున్న విధానం బయటపడింది. అరలు తెరచి చూడగా 400 మద్యం సీసా పెట్టెలను గుర్తించారు. దీని విలువ రూ.8 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు.
*శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దోహా నుంచి నగరానికి వస్తున్నాడు. అతను 1,164 గ్రాముల(1.164 కిలోలు) బంగారాన్ని రసాయనాలతో కరిగించి పేస్టులా మార్చి ప్రత్యేక కవర్‌లో ప్యాకింగ్‌ చేసి లోదుస్తుల్లో పెట్టుకొని ఇండిగో విమానంలో శంషాబాద్‌లో దిగాడు. బయటకు వస్తున్న క్రమంలో అతన్ని భద్రతాధికారులు తనిఖీ చేయగా.. సుమారు రూ.37 లక్షల విలువైన అక్రమ బంగారం బయటపడింది.
*ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో దర్శకుడు రాంగోపాల్‌వర్మ పెట్టిన పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా కార్యకర్త ఒకరు హైదరాబాద్‌లోని బాచుపల్లి ఠాణాలో ఆదివారం ఫిర్యాదు చేశారు.
*తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాకినాడలోని తారకరామనగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన చోడిపల్లి జగన్నాథం(45) అత్యాచారానికి పాల్పడ్డాడు.
*ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం కోమటికుంట సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో తెదేపా నేత భాస్కర్‌రెడ్డి హత్య కేసులో 19 మంది వైకాపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో 11 మంది డీఎస్పీ ఎదుట ఆదివారం లొంగిపోయారు.
*మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సన్నిహిత సంబంధం పెట్టుకుందన్న కారణంతో దేవిగఢ్‌ గ్రామంలో 27 ఏళ్ల ఓ మహిళకు గిరిజన పంచాయతీ పెద్దలు శిక్ష విధించారు.
*ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై అంజయ్య (56) గుండెపోటుతో మృతి చెందారు. రోజులాగే సోమవారం విధులు నిర్వహించి మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌లోని విశ్రాంతి గదిలో విశ్రాంతి తీసుకుని అనంతరం వాష్ రూం (బాత్రూమ్) లోకి వెళ్లిన ఆయన అక్కడే కుప్పకులిపోయాడు.