DailyDose

జెట్ ఎయిర్ వేస్ మూతపడనుందా?-వాణిజ్య-04/16

jet airways shutting down after meeting today

* జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభానికి ఇంకా తెర పడలేదు. నిధుల లేమితో పాతాళానికి పడిపోయినజెట్‌ ఎయిర్‌వేస్ కార్యకాలాపాలు మూడ పడనున్నాయని తెలుస్తోంది. మంగళవారం నాటి జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. ముంబైలో కొనసాగుతున్న బోర్డు సమావేశంలో ఆర్థిక సహాయం అందని కారణంగా జెట్‌ఎయిర్‌వేస్‌ను మూసివేతకు బోర్డు ప్రతిపాదించిందనే వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో ఇన్వెస్ట్ర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 18శాతం కుప్పకూలింది.
*టెలికామ్‌ సంస్థలు 5జీ నెట్‌వర్క్‌ను త్వరితగతిన విస్తరించేందుకు వీలుకల్పించే సేవలను హైదరాబాద్‌కు చెందిన సైయెంట్‌ లిమిటెడ్‌ ఆవిష్కరించింది.
*హైడ్రాలిక్‌ సిలిండర్ల తయారీ సామర్థ్యాన్ని పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ పెంచుకోనుంది. ప్రస్తుతం ఈ సంస్థకు ఏటా 75,000 సిలిండర్లు తయారు చేయగల సామర్థ్యం ఉంది.
* గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నెట్‌వర్క్‌18 రూ.75.57 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.39.32 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ఆదాయం రూ.824.89 కోట్ల నుంచి రూ.1,230.93 కోట్లకు పెరిగింది. వ్యయాలు కూడా రూ.844.50 కోట్ల నుంచి రూ.1,310.71 కోట్లకు చేరాయి.
*2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌ రూ.29.9 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.4.67 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.765.12 కోట్ల నుంచి రూ.1,196.55 కోట్లకు పెరిగింది.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టాటా మెటాలిక్స్‌ రూ.64.35 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం నమోదు చేసిన నికర లాభంతో పోలిస్తే ఇది 17.8 శాతం అధికం. కార్యకలాపాల ఆదాయం 8.7 శాతం పెరిగి రూ.రూ.594 కోట్లకు చేరింది.
*బస్సు టిక్కెట్లను విక్రయించే అభిబస్‌ తన వినియోగదారుల కోసం ఉచిత ప్రయాణ బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
* జపాన్‌కు చెందిన ప్రముఖ మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌, ఆటోమేషన్‌ కంపెనీ డైఫుకు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వేగా కన్వేయర్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.
*రూ.2 కోట్లకు పైగా వార్షిక టర్నోవరు ఉన్న వ్యాపారులు 2017-18 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ ఆడిట్‌ నివేదికలను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు.
* బస్‌ టికెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ రెడ్‌బస్‌ ప్రచారకర్తగా ప్రఖ్యాత క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీని నియమితులయ్యారు. ‘బ్రాండ్‌కు సంబంధించి అన్ని ప్రసార మాధ్యమ ప్రకటనల్లో ధోనీ పాల్గొంటారని, త్వరలోనే ప్రచార చిత్రాలు విడుదల చేస్తా’మని రెడ్‌బస్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ప్రకాశ్‌ సంగమ్‌ తెలిపారు.
*భారత ఎగుమతులు మార్చిలో అయిదు నెలల గరిష్ఠానికి చేరాయి. ఔషధ, రసాయనాల, ఇంజినీరింగ్‌ విభాగాల్లో అధిక వృద్ధి కారణంగా అవి 11 శాతం మేర పెరిగి 32.55 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.
*ఐఫోన్‌ అన్ని మోడళ్లు దేశీయంగానే తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని ప్లాంటులో పరిమితంగా, కొన్ని పాత మోడళ్లు మాత్రమే తయారు చేస్తున్న సంగతి విదితమే.
*జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు కొనసాగేందుకు అత్యవసరంగా నిధులు సమకూర్చాలన్న అంశంపై బ్యాంకర్లు ఇంకా స్థిర నిర్ణయానికి రాలేదు. సోమవారం జెట్‌ యాజమాన్యం, బ్యాంకర్ల సమావేశం సుదీర్ఘంగా సాగినా, తుదినిర్ణయానికి రాలేకపోయింది.
*పాత పెట్రోలు, డీజిల్‌ ఇంజిన్‌ కార్లను విద్యుత్‌ వాహనాలుగా మార్చుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది ఇ-ట్రియో. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ పాత కార్లను కేవలం 36 గంటల్లోనే విద్యుత్‌ వాహనంగా మార్చేస్తుంది.