WorldWonders

12వ శతాబ్దంలో ప్రారంభించి 200ఏళ్లు కట్టిన చర్చి అది. బూడిద అయిపోయింది.

history of notredame church in paris

రాజధాని పారిస్​లోని ప్రఖ్యాత నోటర్ ​డామ్​ చర్చిలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనలో చర్చి పైకప్పు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈస్టర్​ పర్వదినం కోసం ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఎంతో విశిష్ఠ చరిత్ర కలిగిన నోటర్​ డామ్​ చర్చిలో ప్రమాదం జరగడం పారిస్​​ వాసులను కలచివేసింది. కొంతమంది సీన్ నదిఒడ్డున మంటలు ఆరిపోవాలని ప్రార్థనలు చేశారు. నోటర్ ​డామ్​ చర్చిని 12వ శతాబ్దంలో ప్రారంభించారు. 10 శతాబ్దంలో మొదలుపెట్టిన చర్చి నిర్మాణం 200 ఏళ్లపాటు కొనసాగింది. 18వ శతాబ్ద ప్రారంభంలో క్యాథలిక్​లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో చర్చి ధ్వంసమైంది. రెండు దశాబ్దాలు కష్టపడిన వాస్తుశిల్పి యూజీన్​ వయోల్లెట్​ చర్చికి మళ్లీ పూర్వ రూపం తీసుకొచ్చారు. ఈ చర్చి విధ్వంసమే ముఖ్య భూమికగా తీసుకున్న ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో.. “ది హంచ్ బ్యాక్​ ఆఫ్ నోటర్​డామ్” నవలను రాశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల ఆక్రమణ నుంచి తప్పించుకున్నందుకు సూచనగా ఆగస్టు 24, 1944లో ఈ చర్చి గంటల్ని మోగించారు. ప్రమాదం కారణంగా ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మాక్రాన్​ సమావేశాలను రద్దు చేసుకున్నారు. “మనలో భాగమైన చర్చిలో మంటలు చెలరేగటం ఎంతో బాధాకరం” అని ట్వీట్​ చేశారు మాక్రాన్​. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అగ్ని మాపక సిబ్బంది వాహనాలకు దారిని వదలాలని ప్రజలకు అక్కడి పోలీసు విభాగం విజ్ఞప్తి చేసింది. నోటర్ ​డామ్ ఘటనపై ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం యునెస్కో విచారం వ్యక్తం చేసింది. చర్చికి పునర్వైభవం తీసుకురావాలని కోరింది. నోటర్​ డామ్​ వెలకట్టలేని వారసత్వ సంపదగా అభివర్ణించింది. నోటర్ ​డామ్​కు 1991లో యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. నోటర్​ డామ్ చర్చిలో మంటలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “అత్యంత భయంకర ఘటన. అవసరమైతే మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్ల ద్వారా నీళ్ల ట్యాంకర్లను వినియోగించాలి. త్వరగా చర్యలు చేపట్టాలి” అని ట్రంప్ ట్వీట్​ చేశారు. మెర్కెల్​
నోటర్ ​డామ్ చర్చిలో అగ్నిప్రమాదం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు జర్మనీ ఛాన్స్​లర్ ఏంజెలా మెర్కెల్. నోటర్​ డామ్ చర్చి దగ్ధమవుతున్న దృశ్యాలు బాధ కలిగిస్తున్నాయన్నారు.