DailyDose

బాలిక తల నరికిన యువకుడు-CrimeNews-May 10 2024

బాలిక తల నరికిన యువకుడు-CrimeNews-May 10 2024

* తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్‌ జారీ చేసింది. సీఆర్‌పీసీ 73 సెక్షన్‌ కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీలో వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు బృందం గుర్తించింది. కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ ఎయిర్‌ పోర్టులో దిగినా పట్టుకునేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రెడ్‌ కార్నర్‌ నోటీసు, ఇంటర్‌పోల్‌ అధికారులను దర్యాప్తు బృదం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సీఆర్పీసీ 73 ద్వారా పోలీసులు అరెస్టు వారెంట్‌ తీసుకున్నారు.

* తమకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ అధికారులు ఆపడంతో ఆగ్రహించిన ఓ యువకుడు తనను వివాహం చేసుకోబోయే బాలిక తల నరికి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని మడికేరిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మడికేరిలోని సూర్లబ్బి గ్రామానికి చెందిన ప్రకాశ్‌ (32)కు అదే గ్రామానికి చెందిన బాలిక(16)తో వివాహాన్ని ఇటీవల పెద్దలు నిశ్చయించారు. గురువారం వీరికి నిశ్చితార్థం జరుగుతుండగా ఈ సమాచారం అందుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ అధికారులు వచ్చి ఎంగేజ్‌మెంట్‌ను అడ్డుకున్నారు. బాలిక మైనర్‌ కాబట్టి వివాహం చేయకూడదని అలాచేస్తే జైలు శిక్ష పడుతుందని ఇరువురు కుటుంబాలకు అవగాహన కల్పించారు. దీంతో వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన ప్రకాశ్‌ బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు. బాలికను ఇంటినుంచి బయటకు లాక్కెళ్లి ఆమె తల నరికి హత్య చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

* వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 6వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ పరీక్ష జరిగింది. గుజరాత్‌ (ఘుజరత్)లోని ఓ కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహణలో అక్రమాలు (ంఅల్ప్రచ్తిచె ఇన్ ణేఏట్ ఏక్షం) చోటుచేసుకున్నాయి. పంచమహల్‌ జిల్లాలోని గోద్రాలో కొందరు అభ్యర్థులు (ణేఏట్ ఆస్పిరంత్స్) మెరిట్‌ సాధించేలా ఓ స్కూల్‌ టీచర్‌ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. రూ.10లక్షలిస్తే వారి పరీక్ష తానే రాస్తానని హామీ ఇచ్చాడు. చివరకు అతడి బండారం బయటపడి పోలీసులకు చిక్కాడు. గత ఆదివారం గోద్రా స్కూల్‌లో నీట్‌ (ణేఏట్) ప్రవేశ పరీక్ష జరిగింది. ఇందులో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో అదనపు కలెక్టర్‌, జిల్లా విద్యా అధికారుల బృందం వెంటనే స్కూల్‌కు చేరుకుని ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఆ టీచర్‌ నిర్వాకం బయటపడింది. ఈ స్కూల్‌లో ఫిజిక్స్‌ టీచర్‌గా పనిచేస్తున్న తుషార్‌ భట్‌.. నీట్‌ పరీక్షకు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఈ ఎగ్జామ్‌లో మెరిట్ కోసం 16 మంది అభ్యర్థులతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

* ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరైంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించేందుకు అనుమతిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు మద్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 1 వరకు కేజ్రీవాల్‌ ఈ బెయిల్‌ వర్తించనుంది. అప్పటి వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జూన్‌ 2న తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు లిక్కర్‌ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అరెస్ట్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, మద్యంతర బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కోరుతూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైల్లో ఉన్నారు. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z