తనపై అసభ్య రాతలు, అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటూ నిన్న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీనటి పూనమ్ కౌర్ ఈ రోజు మరోసారి హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నిన్న అధికారులు ఎవరూ లేకపోవడంతో బుధవారం వచ్చిన పూనమ్.. సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్‌ను కలిశారు. యూట్యూబ్‌లో తనపై అసభ్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని రఘువీర్ తెలిపారు. 36 యూట్యూబ్ ఛానళ్లపై పూనం ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా ముప్పై ఆరు.
Related tags :