ScienceAndTech

ఆధార్ సమాచారం భద్రం.

aadhaar servers were not hacked confirms uidai

తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ఆధార్‌ కార్డుదారుల వివరాలను ఐటీ గ్రిడ్స్‌ అనే ప్రైవేటు సంస్థ సేకరించిందన్న ఆరోపణలపై భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) బుధవారం స్పందించింది. ఈ కేసుకు సంబంధించి తమ సర్వర్లలోకి అక్రమంగా చొరబడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. తమ ‘సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ’ (సీఐడీఆర్‌), సర్వర్లు పూర్తి సురక్షితంగా ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. సీఐడీఆర్‌లోకి అక్రమంగా ఎవరూ అనుసంధానం కాలేదని, సర్వర్ల నుంచి ఎలాంటి డేటా అపహరణకు గురికాలేదని పేర్కొంది. ‘‘ప్రజల ఆధార్‌ నెంబర్లు, పేర్లు, చిరునామా తదితరాలను యూఐడీఏఐ సర్వర్ల నుంచి తస్కరించారనడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎలాంటి ఆధారాలను గుర్తించలేదు.