DailyDose

చంద్రబాబు సచివాలయానికి వచ్చి కూర్చోవచ్చు:ద్వివేది-రాజకీయం-04/19

chandrababu can come to secretariat says dwivedi

* బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం హోరాహోరీ సమరానికి సిద్ధమైంది. ఇక్కడ నుంచి భాజపా తరఫున కేంద్ర మంత్రి సదానందగౌడ, కాంగ్రెస్‌-జేడీఎస్‌ తరఫున రాష్ట్ర మంత్రి కృష్ణభైరేగౌడ పోటీ పడుతున్నారు. ఇద్దరిపైనా అవినీతి మరకలు లేకపోవడంతో ఆసక్తికర పోరు నడుస్తోంది. ఈ స్థానం పరిధిలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉపాధి కోసం వచ్చి స్థిరపడిన ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. కేంద్ర గణాంక శాఖ మంత్రి డి.వి.సదానందగౌడ ఇప్పటివరకు మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఏనాడూ ఒకే స్థానం నుంచి రెండో సారి పోటీ చేయని ఆయన బెంగళూరు ఉత్తర నుంచి ఆ ప్రయత్నానికి సిద్ధమయ్యారు. 2014లోనూ స్థానికేతరుడన్న అవరోధాన్ని ఎదుర్కొన్న ఆయన.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ గెలుపొందారు. ఈసారి అక్కడి నుంచి బరిలోకి దిగి గట్టిగా ప్రచారం చేస్తున్నారు. మోదీ అభివృద్ధి కార్యక్రమాలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకు పోటీగా ప్రస్తుత రాష్ట్ర మంత్రి కృష్ణభైరేగౌడ కూటమి తరఫున బరిలో దిగారు. లోక్‌సభ ఎన్నికలకు 2009లో పోటీ చేసి ఓడిపోయినా.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన కృష్ణభైరేగౌడ ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో ప్రపంచ స్థాయి వర్తమాన అంశాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సభ్యుడిగా గుర్తింపు పొందారు. 15 రోజుల కిందటి వరకు ఆయన పోటీని ఎవ్వరూ ఊహించలేదు. జేడీఎస్‌ అధినేత దేవేగౌడ పోటీ చేయాలనుకున్నారు. చివరి నిమిషంలో దేవేగౌడ తుమకూరును ఎంచుకోవడంతో బెంగళూరు ఉత్తరకు కృష్ణభైరేగౌడను ఎంపిక చేశారు. జేడీఎస్‌ నుంచి అసమ్మతి లేకపోవడం కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులకు దగ్గరలో ఉన్న బెంగళూరు ఉత్తరలో తెలుగు ఓటర్ల సంఖ్య కీలకం. ఒక్కలిగలు, దళితులు సముదాయాల పరంగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ కన్నడ భాషతో పాటు తెలుగు, తమిళంలో పార్టీలు కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తుంటాయంటే వారి ప్రభావం ఏపాటిదో చెప్పవచ్చు. విమానాశ్రయం దారిలో ట్రాఫిక్‌ సమస్య, హెబ్బాళ చెరువు కాలుష్యం, వలస వచ్చిన వారికి ఎదురవుతున్న చట్టపరమైన సమస్యలు, మౌలిక వసతుల లేమి.

* కళ్లు మిరిమిట్లుగొలిపే ఐటీ పార్కులున్న మధ్య బెంగళూరు నియోజకవర్గం దేశం నలుమూలల నుంచి వచ్చిన వలస మేధావులకు నిలయం! వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ నివాసం ఉంటున్నారు. నగరానికి వాణిజ్య కేంద్రంగా పేరొందింది. వలస వాసులను మచ్చిక చేసుకున్న వారికి విజయం ఖాయంగా కనిపిస్తోంది. భాజపా, కాంగ్రెస్‌ హోరాహోరీ పోటీ నడుమ నటుడు ప్రకాశ్‌రాజ్‌ బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది.

* అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి. ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి చంద్రమౌళిని పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌. చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న జగన్‌ మోహన్ రెడ్డి. చంద్రమౌళి త్వరగా కోలుకోవాలని ఏపీ వ్యాప్తంగా పూజలు నిర్వహించాలని సాంప్రదాయ మత్స్యకారుల నిర్ణయం

* కాంగ్రెస్‌ పార్టీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది గుడ్‌బై చెప్పారు. కొద్ది రోజుల క్రితం మధురలో ప్రియాంక చతుర్వేది రఫెల్‌ డీల్‌ గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమె పట్ల కొందరు కాంగ్రెస్‌ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో వారిపై ప్రియాంక కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారిని పార్టీ సస్పెండ్‌ చేసింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా జోక్యంతో వారిపై సస్పెండ్‌ ఎత్తివేసినట్లు ప్రకటించారు. దీనిపై ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. అభ్యంతరకరంగా మాట్లాడి, తనను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోందని పేర్కొన్నారు.

* కేంద్రమంత్రి, బీజేపీ నేత మనోజ్ సిన్హా మాఫియా తరహాలో వ్యాఖ్యలు చేశారు. విమర్శుకులు నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుగు గంటల్లో అంతు చూస్తామంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.

* ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు కూడా సెక్రటేరియట్ కు రావచ్చని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కొన్ని సమీక్షలను కూడా ముఖ్యమంత్రి నిర్వహించవచ్చని అన్నారు. పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల్లో… ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు? అనే విషయం స్పష్టంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు వారివారి కార్యాలయాల్లో కూర్చోవచ్చని, అయితే రాజకీయపరమైన పనులను మాత్రం చేపట్టకూడదని తెలిపారు

* ఈ ఎన్నికలలో టీడీపీ అత్యధిక స్థానాలలో గెలుపొందబోతోందని… చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారని జంగారెడ్డిగూడెంకు చెందిన రెడ్డి చెరువు సిద్ధాంతి మరాటా మదన్ కుమార్ జోస్యం చెప్పారు. కర్ణాటకలోని దేవమ్మ తల్లి అనుగ్రహంతో గత 12 ఏళ్లుగా జ్యోతిష్యం, వైద్యం చేస్తున్నానని ఆయన తెలిపారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని… 2014లో చంద్రబాబు, మోదీ అధికారంలోకి వస్తారని 15 రోజుల ముందే ఛాలెంజ్ చేసి చెప్పానని సిద్ధాంతి అన్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందబోతోందనే విషయాన్ని కూడా వెల్లడించానని చెప్పారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో మోదీ అతి తక్కువ మెజార్టీతో మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. తాను చెప్పినవన్నీ ఇప్పటి వరకు జరిగాయని… ఇప్పుడు చెప్పింది కూడా జరగబోతోందని తెలిపారు.

* రాజమండ్రి టీడీపీ ఎంపీ, సినీనటుడు మురళీ మోహన్ కోడలు మాగంటి రూప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డ రూపను అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కాసేపటి క్రితం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆమెకు సూచించారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా రూప పోటీ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల మురళీమోహన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. అయినా చంద్రబాబు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్నికలకు ముందు నుంచే ఎన్నికల సంఘంపై పోరాటం ప్రారంభించిన చంద్రబాబు ఇప్పుడు మరో అంకానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలకు అనుకూలంగా ప్రచారం చేయబోతున్నారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచే ఈసీపై సమరశంఖం పూరించి అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు. ఇప్పుడు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే మోదీపై మరో యుద్ధానికి సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాల కోసం ప్రచారం చేయబోతున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. రాహుల్‌తో కలిసి ప్రచార సభలో పాల్గొనడమే కాకుండా రాయచూర్ సభలో ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్నారు.

* స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్ద తర్వాత చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన ఒక వీడియోను శుక్రవారంనాడు ఆయన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. రద్దు చేసిన పాత నోట్లకు బదులుగా కొత్త నోట్ల మార్పడి జరుగుతున్న వ్యవహారానికి సంబంధించిన వీడియా ఇది.

* దేశాన్ని సరికొత్త దారుల్లో నడిపించాలంటే కొత్త ప్రధానమంత్రి కావాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మయిన్‌పురిలో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

* పాటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ హార్దిక్ పటేల్ చెంప చెల్లుమనేలా కొట్టాడు గుర్తుతెలియని ఓ వ్యకి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో హార్దిక్ మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేకుంది. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హార్దిక్ పటేల్ సహా రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హార్దిక్ పటేల్ మాట్లాడుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఒక్కసారిగా వేదికపైకి వచ్చి హార్దిక్ చెంపపై కొట్టాడు.

* ప్రిసైడింగ్ అధికారులపై ఈసీ క్రిమినల్ కేసు నమోదు చేసింది. మండపేట మండలం మారేడుబాకలో.. వీవీ ప్యాట్ స్లిప్పులను చెత్తకుప్పలో పడేసిన వ్యవహారంపై ఈసీ చర్యలు తీసుకుంది. ప్రిసైండింగ్ ఆఫీసర్ గంటా లత, ఏపీవో ముచ్చుకరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరిద్దరిని ఎన్నికల అధికారులు విధుల నుంచి తొలగించారు.

* 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సరైన ఆధారాలు లేవని మ్యూలర్​ నివేదిక స్పష్టం చేసింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇలాంటి పరిస్థితి మరే అధ్యక్షుడికి రాకూడదని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు రాబర్ట్​ మ్యూలర్​ నివేదిక క్లీన్​చిట్​ ఇచ్చింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సరైన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. మ్యూలర్​ ప్రకటనకు సంతోషించిన ట్రంప్… విభిన్న రీతిలో వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి మరే అధ్యక్షుడికి రాకూడదంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.