DailyDose

ఎన్‌డీ తివారీ కొడుకుది హత్య-తాజావార్తలు-04/20

rohit tiwari murdered says police

Ø ముఖ్యమంత్రి చంద్రబాబు 69వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రం అంతటా తెదేపా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు
Ø తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది
Ø విజయవాడ స్వరాజ్ మైదానంలో ప్రతీ ఏటా నిర్వహించే ఎక్సిబీషన్ ప్రారంభమైంది
Ø ఎన్ డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు
Ø రామోజీ ఫిలింసిటీలో జరిగిన రామోజీరావు మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్, ఉపరాష్ట్రపతి తదితర ప్రముఖులు హాజరయ్యారు
Ø స్కూలుకు వేసవి సెలవులు ఇవ్వడంతో మోటార్ సైకల్ పై స్వగ్రామానికి వెళుతున్న ఇరువురు చిన్నారులను, వారి మేనమామను ఎదురుగా వచ్చిన కారు డీ కొనడంతో ముగ్గురూ మృతి చెందిన సంఘటన వరంగల్లో జరిగింది
Ø అమేధిలో రాహుల్ గాంధీ నామినాషన్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని భాజపా, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది
Ø ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా రాత్రి సమయంలో అక్కడక్కడా చిరు జల్లులు పడుతున్నాయి
Ø తెదేపా రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మేనల్లుడు ధర్మరాం ఇంటర్లో ఫెయిల్ కావడంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలొనీలో ఏడంతస్థులపై నుండి దూకి ఆత్మాహత్య చేసుకున్నాడు
Ø హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఒక బాలికల వసతి గృహంలో రేఖ అనే పనిమనిషి లిఫ్ట్ ఎక్కే ప్రయత్నంలో జారి కింద పడి మృతిచెందింది
Ø తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం సమీపంలో ఒక గూడ్స్ రైలు డ్రైవరు తన డ్యూటీ సమయం ముగిసిందని అంటూ మార్గమధ్యంలోనే రైలు పట్టాలపై రైలును వదిలేసి వెళ్ళిపోయాడు
Ø తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది
Ø ఢిల్లీలో కాంగ్రేస్ తో తాము పొత్తు పెట్టుకోవట్లేదని ముఖ్యమంత్రి కేజ్రివాల్ ప్రకటించారు.

*మండువేసవిలో కురిసిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటలకు భారీగా నష్టం కలిగించాయి. ఖమ్మం, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కుమురంభీం ఆసిఫాబాద్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వానలు పడటంతో రైతులు బెంబేలెత్తిపోయారు. కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు నేలకూలాయి.

*తెలంగాణలో విపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై తెరాస అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఆక్కడి జడ్పీటీసీ, ఎంపీపీ పదవుల్లో పాగా వేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
*భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సైబర్‌ వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆయన పేరుతో ఓ నిందితుడు ఫేస్‌బుక్‌ ఖాతా ప్రారంభించాడు.మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా మరో ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టులు పెడుతున్నారు.
*తెలంగాణలో విపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై తెరాస అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఆక్కడి జడ్పీటీసీ, ఎంపీపీ పదవుల్లో పాగా వేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
*దక్షిణాదిన భాజపాకు ఎదురు గాలి వీస్తోంది. కర్ణాటకలో ఎన్‌డీఏ వ్యతిరేక పవనాలు తన పర్యటనలో బలంగా వీస్తున్నాయి. ఇక్కడ భాజపా అభ్యర్థులు దారుణంగా ఓడిపోతారు. భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్న చోట అభివృద్ధి సాధ్యమవుతోందనే విషయాన్ని ప్రజలు గమనించాలి.
*అధిక పోషక విలువలకు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన కాలిఫోర్నియా బాదం నేడు కశ్మీర్‌లో ఉగ్రవాద నిధులకు కేంద్ర బిందువుగా మారింది. ఈ గింజలను అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉత్పత్తి చేస్తారు. భారీ రవాణా నెట్‌వర్క్‌ ద్వారా అవి నియంత్రణ రేఖ వాణిజ్యంలోకి ప్రవేశిస్తున్నాయి.
*మహిళా స్వశక్తీకరణ సమాజ బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. మహిళా భాగస్వామ్యం లేకుండా వేగవంతమైన ఆర్థిక మార్పు అసాధ్యమన్నారు. వొడాఫోన్‌ ఇండియా ఫౌండేషన్‌, లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ‘జాదూ గిన్నీ కా’ పేరుతో నిర్వహించిన ఆర్థిక అవగాహన కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణాభివృద్ధి సంస్థలో శుక్రవారం ‘ఆర్థిక అవగాహన ద్వారా మహిళా సాధికారత’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు.
* ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో శనివారం నుంచి నీటిని మళ్లీ నింపనున్నారు. బుధవారం ఎల్లంపల్లి జలాశయం నుంచి ప్రారంభమైన నీటి విడుదలతో ఆరో ప్యాకేజీ సర్జిపూల్‌ను క్రమంగా నింపుతున్నారు.
* ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పును చిరుధాన్యాలకు పెరుగుతున్న ఆదరణ సూచిస్తోందని దిల్లీ విశ్వవిద్యాలయం ఆర్థిక వికాస కేంద్రం ఆచార్యులు నూతలపాటి చంద్రశేఖరరావు అన్నారు. అవసరాలకు తగ్గట్టు చిరుధాన్యాల ఉత్పత్తి లేదని, వాటిలో కొత్త రకాలు రావాల్సిన అవసరం ఉందని వివరించారు.
*రైళ్లు ఆలస్యంగా రావడం, ఇతర సమస్యలపై రైల్వేశాఖకు దేశవ్యాప్తంగానూ పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఎస్‌ఎంఎస్‌లు, రైల్వేశాఖ వెబ్‌సైట్లతో పాటు ట్విటర్‌లో రైల్వేమంత్రికి, జీఎంలు, డీఆర్‌ఎంలకు భారీ సంఖ్యలో ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. సురక్షిత ప్రయాణం, సమయపాలన..ఈ రెండు అంశాలు తమ తొలి ప్రాధాన్యాలని రైల్వేశాఖ రెండేళ్లుగా పదేపదే చెబుతోంది.
*ప్లాస్టిక్‌ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని పేర్కొంటూ కాలుష్య నియంత్రణ మండలి, పురపాలక, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధించేలా ఆదేశించాలని కోరుతూ కృష్ణా జిల్లాకు చెందిన వైవీ హరికృష్ణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు
* కాపు కార్పొరేషన్‌ ఎండీ కోట్ల శివశంకర్‌రావును ఆయన మాతృశాఖకు పంపిస్తూ(రీప్యాట్రియేట్‌) బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులివ్వడం వివాదాస్పదమైంది. ప్రణాళిక శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న శివశంకర్‌రావును 2017 డిసెంబరులో డిప్యుటేషన్‌ కింద కాపు కార్పొరేషన్‌ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
*ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ఏపీ ఎంసెట్‌-2019 ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష ఏర్పాట్లపై ‘ఈనాడు- ఈటీవీ’తో ఆయన మాట్లాడారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టికెట్‌లో కేటాయించిన సమయం కంటే గంట ముందుగా పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని చెప్పారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది, వ్యవసాయ- వైద్య విభాగంలో 86,910 మంది కలిపి మొత్తం 2,82,633 మంది దరఖాస్తుదారులు ఈ ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌లో రాయనున్నారని చెప్పారు. 115 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
* తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదే నెల 27న పూర్తవుతాయి. మార్చి పరీక్షల్లో తప్పిన వారు, మార్కులను పెంచుకోవాలనుకున్న వారు ఈ పరీక్షలు రాస్తారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.
* పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన (స్పాట్‌) కేంద్రాల వద్ద ఎస్‌టీయూటీఎస్‌ (రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను వదిలేసి, ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయకుండా తమపై నిందలు వేస్తున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సదానందంగౌడ్‌ పేర్కొన్నారు. డీఏలు ఇవ్వకుండా, ఐఆర్‌ ప్రకటించకుండా, పీఆర్‌సీ నివేదికను తేల్చకుండా, ఉపాధ్యాయుల పదోన్నతులు, టీఆర్‌టీ నియామకాలు చేయకుండా పాఠశాలలు బాగుపడకపోవడానికి తమనే బాధ్యులను చేయడం సరికాదన్నారు.
* విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామానికి చెందిన పత్తి చిన్నబాయికి చెందిన పెంకుటింటిని బొగుడు భరతడు కొనుగోలు చేశారు. పొక్లెయిన్‌తో ఇంటిని పడగొట్టారు. మట్టిలో వెండి నాణేలు బయటపడ్డాయి. ఇవి 1882, 1885, 1888, 1901 సంవత్సరాలకు చెందినవిగా తేలింది.
*ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను ఆంగ్లంతో పాటు, తెలుగు భాషలోనూ ఇవ్వాలని లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. విశాఖపట్నంలోని సిరిపురంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇచ్చే ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రాలతో తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదువుకున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి తెలుగు భాషను మర్చిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు.
*చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున పోటీ చేసిన చంద్రమౌళిని, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమౌళి హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్‌ శుక్రవారం నేరుగా ఆసుపత్రికి వచ్చారు. అతడి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జగన్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నారు.
*విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోన్న ఓ బాలింత గురువారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఆసుపత్రి నుంచి పరారైంది. మన్యంలోని ముంచంగిపుట్టు మండలం జలద గ్రామానికి చెందిన చంద్రమ్మ(30)ను ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ఈనెల 17న కేజీహెచ్‌లో చేర్పించారు. ఆమెకు 18వ తేదీ మధ్యాహ్నం శస్త్రచికిత్స చేశారు.
నేటి నేర వార్తలు – 04/20
*మదర్సా ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేసిన ఓ 18 ఏళ్ల యువతిని సదరు బడి ప్రాంగణంలోనే ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు సజీవ దహనం చేసిన విషాదఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది.
*కార్లు అద్దెకు తీసుకుని వాటిని అమ్మేసుకుంటున్న సంశేఖర్‌ తంగ్లి అలియాస్‌ అప్పు (31) అనే ప్రబుద్ధుడ్ని ఠాణె జిల్లా కసర్‌వాడావలి పోలీసులు అరెస్టు చేశారు.
*ఏనుగు దాడిలో రెండు గ్రామాల్లోని అయిదుగురు మృత్యువాతపడ్డారు. ఒడిశాలోని అనుగుల్‌ జిల్లా తాల్చేర్‌ అటవీ ప్రాంతంలోని సొండొపూర్‌, సంతపడ గ్రామాల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
* తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. తిరువణ్ణామలై సమీపంలో పొట్ట కూటి కోసం కూలి పనులను వెళ్లిన ఐదుగురు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు.
*ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి చేతికందిన ఓ సీసాలోని యాసిడ్‌ తాగి అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది.
*దివంగత మాజీ గవర్నర్‌ ఎన్‌డీ తివారి కుమారుడు రోహిత్‌ శేఖర్‌ తివారిది అసహజ మరణమని శవపరీక్షలో తేలింది. దీంతో దిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
* సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున అయిదుగంటల సమయంలో ఏడో అంతస్తులోని సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగం నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు వచ్చాయి.
*ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించేలా దీవించాలని స్వామిని వేడుకునేందుకు ద్విచక్ర వాహనంపై ఆ ప్రేమికులు యాదగిరిగుట్టకు బయలుదేరారు. మార్గమధ్యంలో కారు రూపంలో వచ్చిన మృత్యువు వారి ప్రేమను చిదిమేసింది. ఈ విషాదకర ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో చోటుచేసుకుంది.
* కర్ణాటకలోని రాయచూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
*త్రిపుర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రద్యోత్‌ దేవ్‌ బర్మన్‌ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన సోదరి కాన్వాయ్‌పై దాడికి పాల్పడినందుకు ప్రత్యర్థి పార్టీ కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించారు.
*విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో హిజ్రాలపై కొందరు వ్యక్తులు కర్రలతో వెంబడించి దాడికి పాల్పడ్డారు. షాపుల దగ్గర డబ్బులు వసూలు చేస్తుండగా స్థానికులు వీరిపై దాడి చేశారు. తాము హిజ్రాలు అవునో? కాదో? చెప్పాలంటూ వర్మ అనే వ్యక్తి తమపై దౌర్జన్యం చేశాడని హిజ్రాలు ఆరోపించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ ఘటనలో నలుగురు హిజ్రాలకు గాయాలయ్యాయి.
*ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించేలా దీవించాలని స్వామిని వేడుకునేందుకు ద్విచక్ర వాహనంపై ఆ ప్రేమికులు యాదగిరిగుట్టకు బయలుదేరారు. మార్గమధ్యంలో కారు రూపంలో వచ్చిన మృత్యువు వారి ప్రేమను చిదిమేసింది.
*ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి చేతికందిన ఓ సీసాలోని యాసిడ్‌ తాగి అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది.
*భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సైబర్‌ వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆయన పేరుతో ఓ నిందితుడు ఫేస్‌బుక్‌ ఖాతా ప్రారంభించాడు. మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా మరో ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టులు పెడుతున్నారు.