Kids

ఎగిరే పిల్లి గురించి విన్నారా?

the story of flying caracal cat in telugu

వేగంగా పరుగులు తీసే పిల్లిని చూస్తుంటాం. కానీ ఎగిరే పిల్లిని చూశారా? దాని పేరు కారకాల్‌. ఎక్కువగా దక్షిణాఫ్రికాలో ఉంటాయివి. రాత్రుల్లో చురుగ్గా ఉండే వీటికి చాలా వినికిడి శక్తి. తెలుసా? పక్షుల చప్పుళ్లు వినగానే ఇవి చటుక్కున గాల్లోకి ఎగిరేస్తాయి. తక్కువ ఎత్తులో ఎగిరే పక్షుల్ని వేటాడతాయి. వెంటనే పట్టేస్తాయి. వీటి ఈ సామర్థ్యానికి కారణమేంటంటే… వీటి ముందరి కాళ్లు చిన్నవిగా, తేలికగా ఉంటాయి. కానీ వెనుక కాళ్లు మాత్రం దృఢంగా ఉంటాయి. ముందరి కాళ్ల కంటే ముప్ఫై శాతం ఎక్కువ పొడవుతో పాటు రెండింతల కండరాలని కలిగి ఉంటాయి. ఈ నిర్మాణం వల్లే ఈ పిల్లులు అంత వేగంగా ఒక్కసారిగా ఎగరగలవు. ఇవి పైకి ఎగిరినప్పుడు వాటి వేగాన్ని ఎక్కువ చేయడానికి కూడా ఈ నిర్మాణం ఉపయోగపడుతుందట. ఇంకో ప్రత్యేకత ఏంటో చెప్పనా? ఈ పిల్లులు ఒక్క దాడికి ఒకేసారి 10 నుంచి 12 పక్షుల్ని చంపగలవట.