Movies

మాంగ‌ల్యం తెంతునానేనా

when suryakantham teased a purohit

సూర్య‌కాంతం అంటే ట‌క్కున గుర్తొచ్చేది ఆమె చేసిన గ‌య్యాళి పాత్ర‌లే. వెండితెర‌పై ఎంత చిట‌ప‌ట‌లాడిపోయేవారో.. తెర‌వెనుక అంత నిర్మ‌ల హృద‌యంతో ఉండేవారు. సెట్‌లో ఆమె ఉంటే ఆ సంద‌డేవేరు. అందుకే ఆమెను స‌ర‌దాగా ‘స‌న్‌షైన్’ అనిపిలిచేవార‌ట‌. ఎందుకంటే షూటింగ్ సూర్య‌కాంతితో వెలిగిపోతుంద‌ని అలా అనేవార‌ట‌. ఇక ఆమె షూటింగ్ స‌మ‌యంలో చేసే అల్ల‌రి ఇంతా అంతా కాదు. ఒక సినిమాలో పెళ్లి సీను తీస్తున్నారు. ఆ పెళ్లి తంతు జ‌రిపించ‌డానికి రావాల్సిన పురోహితుడు త‌న స‌హాయ‌కుడిని పంపాడు. రిహార్స‌ల్సులో అత‌డు త‌డ‌బ‌డ్డాడు. అక్క‌డే ఉన్న సూర్య‌కాంతం అత‌ని గురించి అడిగితే, పురోహితుడికి అసిస్టెంట్‌న‌ని చెప్పాడు. ‘‘ఆహా! అవునా నాయ‌నా అందుకే ‘మాంగ‌ల్యం తెంతునానేనా’ అంటున్నావు. క‌ట్ట‌కముందే తెంచేయ‌కు నాయ‌నా.. ప్ల‌గ్ ఊడిపోగ‌ల‌దు’’ అని ఆట ప‌ట్టించారు. ‘ప్ల‌గ్ ఏమిట‌మ్మా’ అని అడిగితే ‘త‌న వెన‌కాల చిన్న ముడి ఉంది క‌దా- అదే ప్ల‌గ్‌’ అని ఆవిడ అన‌డంతో అక్క‌డ ఉన్న‌వారంద‌రూ ఒక్క‌సారిగా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.