DailyDose

ఓటుకు రెండు వేలు ఇచ్చాం-రాజకీయ-04/22

jc diwakar reddy on 2019 elections

*తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి నోరు జారారు. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు. డబ్బులు పంచనిదే ఓట్లు వేయడం లేదని, తిండికి లేని వాళ్ళు కూడా ఓటు ఐదు వేలు డిమాండ్ చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఓటుకు రెండు వేలు పంచామని అంగీకరించారు. మొత్తంగా తన కుమారుడు పోటీ చేసిన నియోజకవర్గంలో రూ. 50 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
*పవన్ కళ్యాణ్ ఆసక్తికర
‘ఇది మనం ఎదిగే దశ. మార్పు చిన్నగానే మొదలవుతుంది. ఈ మార్పు ఎంత వరకు వెళ్తుందో తెలియదు. ఎన్నికలు పూర్తయిన వెంటనే వైఎస్సార్‌సీపీ, టీడీపీలు తమకు ఇన్ని స్థానాలు వస్తాయంటూ లెక్కలు వేయడం మొదలుపెట్టాయి. మనం అలా లెక్కలు వేయం. ఓటింగ్‌ సరళి ఎలా జరిగిందో తెలుసుకోమని మాత్రమే పార్టీ నాయకులకు చెబుతున్నా’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ తరుఫున పోటీ చేసిన అభ్యర్థులతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీకి 15 మంది మాత్రమే హాజరుకావడం గమనార్హం.
* తెదేపాను బతికించేది ఆ రెండే: జేసీ
ఎన్నికల్లో తెదేపాదే గెలుపని ఆ పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛనే తెదేపాను గెలిపిస్తాయని ఆయన అన్నారు. ఈ మేరకు అమరావతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేపట్టినన్ని సంక్షేమ పథకాలు ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. 120 సంక్షేమ పథకాలు ప్రవేశెడితే ఒక్కరైనా అభినందించారా అని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోవట్లేదని, పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛనే లేకపోతే మా గతి అథోగతయ్యేదని జేసీ అన్నారు.
*ప్రజావేదికలో తెదేపా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశానికి అనుమతించారా?
తెదేపాకి చెందిన ఎమ్మెల్యేలతో సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో సమవేశం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం అనుమతి పొందారా? ఎన్నికల సంఘం అనుమతినచిందా?వ అని వైకాపా ఎంపీ.వీ.విజయసయిరేద్ది ప్రశ్నించారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని వైకాపా కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.
*జెట్ మూసివేత ఓ కుంభకోణం
జెట్‌ ఎయిర్‌వేస్‌ మూసివేత కుంభకోణంలా కనిపిస్తోందని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ అభిప్రాయపడ్డారు. పాలకవర్గానికి సన్నిహితంగా ఉండేవారికి దీన్ని కట్టబెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎవరూ దృష్టి సారించలేరన్న ఉద్దేశంతోనే ఈ మొత్తం ప్రక్రియకు ఎన్నికల సమయాన్ని ఎంచుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని, కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఎక్కువసీట్లువస్తే రాహుల్‌ గాంధీయే ప్రధాని అవుతారని శర్మ చెప్పారు. పార్టీలు సాధించే సీట్లు ఆధారంగా ఎన్నికల అనంతరం పొత్తులుంటాయన్నారు.
* పోలవరం సామర్థ్యం పెంపుతో భద్రాద్రికి ముంపు ముప్పు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రవాహ సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచితే భద్రాచలానికి ముంపు ముప్పు పొంచి ఉంటుందని నీటిపారుదల శాఖ అంతర్‌రాష్ట్ర వ్యవహారాల సీఈ నరసింహారావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాల పరిస్థితిని ఆదివారం ప్రత్యేక అధికారుల అధ్యయన బృందం పరిశీలించింది. సీఈ నరసింహారావు, ఈఈ రాంప్రసాద్‌, ఐఐటీ ప్రొఫెసర్‌ డా.శశిధర్‌ నేతృత్వంలో అధికారులు భద్రాచలంలో పరిశీలన చేపట్టారు.
* గట్టి హెచ్చరికతోనే దిగొచ్చిన పాక్‌
తీవ్ర హెచ్చరికలు చేసినందునే పట్టుబడ్డ భారత వాయుసేన పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్థాన్‌ విడిచిపెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం గుజరాత్‌లోని పాటణ్‌, రాజస్థాన్‌లోని చితోడ్‌గఢ్‌, బర్మేర్‌ల్లో జరిగిన బహిరంగ సభల్లో పాకిస్థాన్‌పై జరిగిన వైమానిక దాడిని వివరించారు. పైలట్‌ పాక్‌కు చిక్కినప్పుడు సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండు చేశాయని, అప్పుడే విలేకరుల సమావేశం నిర్వహించి పాక్‌ను హెచ్చరించామని చెప్పారు.
* మోదీ పాలనతో పెనుముప్పు
‘దేశానికి పొంచి ఉన్న పెను ప్రమాదం నరేంద్ర మోదీ. ఆయనను ప్రధాని పదవి నుంచి దించేద్దాం. ప్రవాసాంధ్రులు, కన్నడిగులు సహకరించాలి’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం కర్ణాటకలోని శ్రీరామనగర, సింధనూరు ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘మోదీది మాటల గారడీ. అన్నీ అబద్ధాలే చెబుతారు. మహాత్ముడు జన్మించిన ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతానికే కళంకం తెస్తున్నారు. ఆంధ్ర, కర్ణాటకకే కాదు దేశానికీ మోదీ చేసిందేమీ లేదు’ అని దుయ్యబట్టారు.
* రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్‌ పాలన
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని భాజపా మాజీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భాజపా కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం భువనగిరికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తానొక్కడే సాధించినట్లుగా.. తమ కుటుంబ పాలన సాగాలని.. తమ మాటే చెల్లాలన్న ధోరణితో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారన్నారు.
* భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబుతో గండ్ర భేటీ
కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్కతో ఆ పార్టీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భేటీ అయ్యారు. ఆదివారమిక్కడ భట్టి నివాసంలో ఆయనతో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు.. గండ్ర వెంకటరమణారెడ్డితో చర్చించారు. గండ్ర కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. శనివారం భట్టి నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశంలో కూడా గండ్ర పాల్గొనలేదు. ఆదివారం మాత్రం భట్టివిక్రమార్క నివాసానికి రావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారుతున్నారనే అంశంపై భట్టి, శ్రీధర్‌బాబు గండ్రతో చర్చించినట్లు తెలిసింది. మరోవైపు తాను కాంగ్రెస్‌ను వీడటంలేదని ఈ సందర్భంగా గండ్ర స్పష్టం చేసినట్లు సమాచారం.
* స్థానిక ఎన్నికలకు భాజపా బాధ్యులు
రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం వివిధ జిల్లాలకు (పాత జిల్లాల వారీగా) ఎన్నికల బాధ్యులను (ఇన్‌ఛార్జి) భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులకు ఈ ఇన్‌ఛార్జులు బి-ఫారంలు జారీ చేస్తారని పేర్కొన్నారు. చింతా సాంబమూర్తి (రంగారెడ్డి), జి.ప్రేమేందర్‌రెడ్డి (కరీంనగర్‌), జి.మనోహర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), యండల లక్ష్మీనారాయణ (ఆదిలాబాద్‌), చింతల రామచంద్రారెడ్డి (వరంగల్‌), పేరాల శేఖర్‌రావు (మెదక్‌), వెంకటరమణి (నిజామాబాద్‌), ఎం.ధర్మారావు (నల్గొండ), కాసం వెంకటేశ్వర్లు (ఖమ్మం)లను నియమించినట్లు వెల్లడించారు.
* ఓటమి భయంతోనే వ్యవస్థలపై చంద్రబాబు దాడులు: అంబటి
ఓటమి భయంతోనే వ్యవస్థలపై చంద్రబాబు దాడులు చేస్తున్నారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘చంద్రబాబు ఐదేళ్లపాటు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారు. వాటిలో ఎలాంటి దోషాలు లేవు. చంద్రబాబే దోషి. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను ఆయన పార్టీ కోసం వాడుకున్నారు. మున్ముందు తెదేపాలో ఒక్కరూ మిగిలే పరిస్థితి ఉండదు. అందరూ చంద్రబాబును వీడి వెళ్లిపోతారు’ అని విమర్శించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
* దేశంలో భాజపా పరిస్థితికి నిదర్శనమిదే: బుద్ధా వెంకన్న
ప్రస్తుతం దేశంలో భాజపా పరిస్థితికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావుపై చెప్పు విసిరిన ఘటనే నిదర్శనమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌పై విషం కక్కుతున్న జీవీఎల్‌ నరసింహారావు, విజయసాయిరెడ్డిలను ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు.
* పార్టీలు 50 శాతం టికెట్లు ఇవ్వకుంటే స్వతంత్రంగా పోటీ
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయపార్టీలూ 50 శాతం టికెట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు- మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య కోరారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, పార్టీల నుంచి స్పందన రాకుంటే.. నిజామాబాద్‌ రైతులను ఆదర్శంగా తీసుకొని బీసీ సంఘం తరఫున జనరల్‌ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయాలని పిలుపునిచ్చారు.
* భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబుతో గండ్ర భేటీ
కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్కతో ఆ పార్టీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భేటీ అయ్యారు. ఆదివారమిక్కడ భట్టి నివాసంలో ఆయనతో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు.. గండ్ర వెంకటరమణారెడ్డితో చర్చించారు. గండ్ర కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. శనివారం భట్టి నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశంలో కూడా గండ్ర పాల్గొనలేదు. ఆదివారం మాత్రం భట్టివిక్రమార్క నివాసానికి రావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారుతున్నారనే అంశంపై భట్టి, శ్రీధర్‌బాబు గండ్రతో చర్చించినట్లు తెలిసింది. మరోవైపు తాను కాంగ్రెస్‌ను వీడటంలేదని ఈ సందర్భంగా గండ్ర స్పష్టం చేసినట్లు సమాచారం.
* ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ
ప్రాదేశిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ఆదివారం తెజస ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి-ఇతర నాయకులతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు.
* పర్యవేక్షక కమిటీ ఏర్పాటు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో తెజస తరఫున కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కోదండరాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో ఆచార్య విశ్వేశ్వరరావు, రమేశ్‌రెడ్డి, పాండురంగారావు, గోపాలశర్మ, జగ్గారెడ్డి, అంబటి శ్రీనివాస్‌, శ్రీశైల్‌రెడ్డి, వి.శ్రీనివాసగౌడ్‌, వెదిరె యోగేశ్వరరెడ్డి, అవినాశ్‌ మాలవ్యలను సభ్యులుగా నియమించామన్నారు.
* తెదేపాను బతికించేది ఆ రెండే: జేసీ
ఎన్నికల్లో తెదేపాదే గెలుపని ఆ పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛనే తెదేపాను గెలిపిస్తాయని ఆయన అన్నారు. ఈ మేరకు అమరావతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేపట్టినన్ని సంక్షేమ పథకాలు ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. 120 సంక్షేమ పథకాలు ప్రవేశెడితే ఒక్కరైనా అభినందించారా అని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోవట్లేదని, పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛనే లేకపోతే మా గతి అథోగతయ్యేదని జేసీ అన్నారు.