DailyDose

మహిళా సీఐ ఆత్మహత్య-నేరవార్తలు–04/22

lady ci suicides in india

* దిండివనంలో మహిళా సీఐ ఆది వారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విల్లుపురం జిల్లా, దిండివనం సమీపం కావేరిపాక్కానికి చెందిన మాణిక్యవేలు భార్య జైహింద్‌ దేవి (38). ఈమె బ్రహ్మదేశం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేశారు. ప్రస్తుతం పదోన్నతి పొంది కడలూరు జిల్లా నైవేలి థర్మల్‌ పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా వెళ్లారు. ఇలావుండగా ఆమె ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కారణాలు తెలియరాలేదు. దిండివనం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. దిండివనం డీఎస్పీ కనకేశ్వరి విచారణ జరుపుతున్నారు.
*అనంతపురం జిల్లా పుట్లూరు మండలం బలపురం ఎస్సీ కాలనీకి చెందిన మల్లిఖార్జున తాడిపత్రిలో ఐటీఐ పూర్తీ చేశాడు. విడపనకల్లు మండలం కొత్తలపల్లికి చెందిన సి. మాధవి తన తల్లి స్వస్థలం పుట్లూరు మండలం కోమటికుంట్లలో తాత రాముడు ఇంటి వద్ద ఉంటూ తాడిపత్రిలోని ఓ ప్రేవేట్ కళాశాలలో డిగ్రీ చదివింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు డిగ్రీ పూర్తీ చేసిన మాధవి తన స్వగ్రామానికి వెళ్లింది. శనివారం మధ్యాహ్న సమయంలో ప్రేమికులిద్దరూ ముందస్తు ప్రణాళిక ప్రకారం తాడిపత్రికి చేరుకున్నారు. కులాలు వేరు అయినందున తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని చర్చించుకున్నారు. కలిసి జీవించే పరిస్థితి లేనపుడు కలిసి చనిపోదామనే నిర్ణయానికి వచ్చారు. వెంట తెచ్చుకున్న విషపుగుళికలు ఇద్దరూ మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.
* యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన జిన్న మురళీ (17) ఆదివారం గ్రామంలో జరిగిన దుర్గమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. పండుగకు ఏర్పాటు చేసిన డీజే మైక్‌ సెట్‌ ఆపరేటర్‌ భువనగిరికి చెందిన మాటూరి శశికాంత్‌ను(19)ను దింపేందుకు భువనగిరికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి గ్రామీణ ఎస్సై రాఘవేంద్ర పేర్కొన్నారు.
* బోధన్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులో పొగలు వచ్చాయి. వెంటనే గమనించిన బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు మేడ్చల్‌ సమీపంలోని ఐటీఐ వద్దకు రాగానే బ్రేక్‌ లైనర్లు పట్టేయడంతో టైర్ల వద్ద మంటలు, పొగలు వచ్చాయి. దీంతో బస్సు డ్రైవర్ రాజు అప్రమత్తమై బస్సును ఒక పక్కకు ఆపి ప్రయాణికులను దింపేశారు. పక్కనే ఉన్న హోటల్‌ నుంచి నీరు తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు. డ్రైవర్‌ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 47మంది ప్రయాణికులు ఉన్నారు.
* శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటకలోని జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) పార్టీకి చెందిన ఏడుగురు నేతలు అదృశ్యమయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
*మహారాష్ట్రలోని భివాండిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కల్హర్‌ ప్రాంతంలోని ఓ భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
*ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలో ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే బాధితురాలు మృతి చెందిందని పోలీసులు శనివారం తెలిపారు.
*ఆటోలో తరలిస్తున్న సోడా గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన శనివారం కర్నూలులో జరిగింది.
*భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఎదురైన సైబర్‌ వేధింపులకు తోడు, తాజాగా మరికొన్ని వివరాలు బయటపడ్డాయి. ఆయన పేరుతో ఓ నిందితుడు నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను ప్రారంభించిన ఉదంతం తెలిసిందే.
* ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాలు శనివారం పిడుగుల మోతతో దద్దరిల్లాయి. వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో నలుగురు, విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.
*పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్న శ్రీకాకుళం విద్యార్థి మనీష్‌కుమార్‌ ర్యాగింగ్‌కు బలయ్యాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
*ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. హావ్‌డా-న్యూదిల్లీ పూర్వ్‌ ఎక్స్‌ప్రెస్‌ దిల్లీ వెళుతున్న సమయంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోమా రైల్వేస్టేషన్‌ సమీపంలో ప్రమాదానికి గురైంది.
* ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కవలలు. సెలవులు రావడంతో తమతోపాటు అత్త కుమార్తెను వెంట తీసుకుని తండ్రితో ద్విచక్రవాహనంపై సొంతూరికి వెళ్తున్నారు. ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.
*వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.
*పెరూ రాజధాని లిమా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
* హైదరాబాద్‌ నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాస్త్రి పురంలో ఓ యువకుడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
*సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బొంబాయి కాలనీలో కన్నబిడ్డలను కర్కశంగా కడతేర్చిన తండ్రి ఘటన మరువక ముందే భార్య, కొడుకుని కొబ్బరిబొండాల కత్తితో కడతేర్చేయత్నం చేశాడు ఓ మారు తండ్రి. ఈ ఘటనలో కొడుకు అక్కడికక్కడే మృతిచెందగా భార్య కొన ఊపిరితో చికిత్స పొందుతుంది.
*ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయిన్‌పురి సమీపంలో ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వే రహదారిపై వస్తున్న ఓ బస్సు.. లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
*చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వరరావుపైనా నిందితులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు.
*గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
*తమిళనాడు తిరుచ్చిలోని తురయ్యార్‌ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలో ఉన్న కురుప్ప స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు మృత్యవాత పడ్డారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.
*హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌ పరిధిలోగల సులేమాన్‌ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అమాన్‌ అనే వ్యక్తి తన భార్య నజ్మాబేగంను సుత్తితో మోదాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ నజ్మా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
* శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో అనుమానితులుగా భావిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈమేరకు ఆ దేశ రక్షణ శాఖ మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది.
* జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు ప్రాంతంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని సినీనటుడికి, ఆయన భార్యకు గాయాలయ్యాయి.
*జింక మాంసంతో విందు చేసుకున్న ఇద్దరు యువకుల్లో ఒకరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేసిన ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.
*యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.
*బోధన్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులో పొగలు వచ్చాయి. వెంటనే గమనించిన బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది.
*తమిళనాడు తిరుచ్చిలోని తురయ్యార్‌ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలో ఉన్న కురుప్ప స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు మృత్యవాత పడ్డారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.