Health

నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం

dental hygiene is most important

మీరు పళ్లు సరిగ్గా తోముతున్నారా లేదా? చాల రోజుల నుండి వున్న చిగుళ్ళ సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారా? అలా చేయకండి. ప్రమాదం పొంచివున్నట్లే తెలుసా! చిగుళ్లు వాయడం, ఎప్పుడు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకండి. గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందట. దంతాలు సరిగ్గా తోముకోవడం వలన దంతాలు అందంగా కనిపించడమే కాదు, గుండె కూడా పదిలంగా ఉంటుంది. ఎందుకంటే చిగుళ్ళ లోని బాక్టీరియా రక్తం ద్వారా, రక్తనాళాలకు చేరి, అక్కడ అతుక్కుని గడ్డలు ఏర్పడడానికి కారణమవుతుంది. ఫలితంగా ఇవి రక్తప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దానితో బీపీ పెరిగి, గుండె కు జరిగే ప్రమాదం ఎక్కువ అవుతుంది. కొంతమందికి వచ్చిన ఎండో కార్డయిటిస్ అనే జబ్బు గురించి పరిశీలన చేసినపుడు దానికి ముఖ్య కారణం నోటిలోని బాక్టీరియా అని తేలిందట. అది ఎలా అంటే నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాళ్ళ నోట్లోని బాక్టీరియా రక్తం ద్వారా గుండెకి చేరి, అక్కడి కావటాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ కూడా దెబ్బ తింటుంది. షుగర్ వ్యాధి శ్వాస కోశ వ్యాధులు ఇలా రకరకాల జబ్బులు వస్తాయట. కాబట్టి అందరు దంతాలు సరిగ్గా శుభ్రంగా తోముకోండి. మీరు ఆరోగ్యంగా వుండండి.