NRI-NRT

“షడ్రుచుల సమ్మేళనం – కవిత్వం” పై టాంటెక్స్ సదస్సు

rajyahsree kethavarapu as chief guest for tantex 141 telugu meeting in dallas

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదికసమర్పించు “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, ఏప్రిల్ 21 న సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ ఆధ్వర్యంలో జరిగినది. ప్రభాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసిజయప్రదం చేసారు. కార్యక్రమంలో ముందుగా చిన్నారి మాడ సమన్విత మృదుమధురంగా ప్రార్థనా గీతాన్ని ఆలపించిప్రారంభించింది. తెలిదేవర మంజు శిష్యులు వెంపటి సీత, శ్రీలత మల్లాడి, చిరంజీవి గెడ్డశ్రీయ హృద్యంగా వీణా వాద్యంతో ముందుకు సాగిన ఉగాదికవి సమ్మేళనం లో డా. ఊరిమిండి నరసింహారెడ్డి రవీంద్రుని గీతాంజలి, మాడ మాడ్దయాకర్ కవితా గానం, మద్దుకూరి చంద్రహాస్ సోషల్ మీడియా పోస్ట్ లపై రాసినస్వీయ కవిత, మల్లవరపు అనంత్ స్వీయ రచన “కొంటెతామర”, కన్నెగంటి చంద్ర స్వీయ కవిత “మళ్ళీ ఇంకోవసంతం”, పుదూర్ జగదీశ్వరన్ స్వీయ రచనతో సాగి శ్రీవేముల లెనిన్ జాషువా లఘు ఖండిక “గిజిగాడు” సమీక్షతోముగిసింది. చిన్నారులు వేముల సాహితీప్రియ, వేములసింధూర, మాడ సమన్విత తడుముకోకుండా, చూడకుండా కందుకూరి రచన “ఎంత చక్కనిదోయి ఈ తెలుగు” అంటూచక్కగా పాడి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి డా. రాజ్యశ్రీ కేతవరపు రచించిన వంద “ప్రశ్నలు–వేలభావాలు” పుస్తకావిష్కరణ జరిగింది. ఫ్రముఖ విశ్లేషకులు నియోగిరచయిత్రి కవిత్వంపై వ్రాసిన సాహిత్య విశ్లేషణ, తనకుసంధించిన 100 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలుపొందుపరిచి ఈ పుష్తకం ప్రచురించినట్లు తెలియచేసారు. పుస్తకం పై జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, అధ్యక్షులు వీర్నపుచినసత్యం స్పందించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి డా.రాజ్య కేతవరపు “షడ్రుచుల సమ్మేళనం – కవిత్వం” అనే అంశంపై ప్రసంగించారు. ప్రతిరుచికి చక్కని ఉదాహరణలతో అనర్ఘళంగా సాగినప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. గీతామృతంలో భగవద్గీతలో శ్లోకాలను సామాన్యమనవుడికి అర్థమయ్యేరీతిలో వ్రాయడంలో తనఅనుభవాలు పాఠకుల స్పందన, ఏ ఎన్ ఆర్ తో తనఅనుబంధం మొదలైన విషయాలను స్పృశిస్తూ షడ్రుచులనూ ఉదహరిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగాప్రసంగించారు. ముఖ్యఅతిథిని భట్రాజు రాణి పుష్పగుచ్ఛముతో సత్కరించగా సమన్వయకర్త గావ్యవహరించి అట్లూరి స్వర్ణ సభకు పరిచయం చేసారు. ప్రసంగానంతరం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘంఅధ్యక్షులు వీర్నపు చినసత్యం, పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డసుబ్రహ్మణ్యం మరియు పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి దుశ్శలువా, మరియు సాహిత్యవేదిక బృందసభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. ఉపాధ్యక్షులు పాలేటిలక్ష్మి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గసభ్యులు మండిగ శ్రీలక్ష్మి మరియు సాహిత్య వేదిక బృందం ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు వీర్నపు చినసత్యం ముఖ్య అతిథి ప్రసంగంపై స్పందిస్తూగత ఐదు సంవత్సారాలుగా పలుమార్లు తెలుగు వెలుగుపత్రికకు కథలు కవితలు అందిస్తున్న రచయిత్రిని ఈవిధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతోవిచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.
TNILIVE-TeluguNewsInternational-TANTEX 141st Telugu Sadassu-Gallery
TNILIVE-TeluguNewsInternational-TANTEX 141st Telugu Sadassu-Gallery
TNILIVE-TeluguNewsInternational-TANTEX 141st Telugu Sadassu-Gallery
TNILIVE-TeluguNewsInternational-TANTEX 141st Telugu Sadassu-Gallery
TNILIVE-TeluguNewsInternational-TANTEX 141st Telugu Sadassu-Gallery
TNILIVE-TeluguNewsInternational-TANTEX 141st Telugu Sadassu-Gallery
TNILIVE-TeluguNewsInternational-TANTEX 141st Telugu Sadassu-Gallery
TNILIVE-TeluguNewsInternational-TANTEX 141st Telugu Sadassu-Gallery