Politics

తివారీ భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు

rohit tiwaris wife apurva shukla tiwari arrested

రోహిత్‌ శేఖర్‌ తివారీ భార్య అపూర్వ శుక్లా తివారీని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ఎన్‌డీ తివారీ కొడుకు రోహిత్‌ శేఖర్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుకు గురై మృతిచెందాడని ప్రాథమిక సమాచారం. కాగా శేఖ‌ర్ తివారిది స‌హ‌జ మ‌ర‌ణం కాదు అని పోస్టుమార్ట‌మ్‌లో తేలింది. రోహిత్‌ను హ‌త్య చేసి ఉంటార‌ని, అది కూడా ఓ దిండుతో చంపి ఉంటార‌ని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. శేఖర్‌ మృతి నేపథ్యంలో విచారణలో భాగంగా రోహిత్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయ‌న కుటుంబీకుల‌ను, ప‌నివాళ్ల‌ను విచారించారు. అపూర్వ శుక్లా తివారీని గత మూడు రోజులుగా ప్రశ్నించి పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 12వ తేదీను ఓటు వేసేందుకు ఉత్త‌రాఖండ్ వెళ్లిన రోహిత్.. ఆ త‌ర్వాత ఏప్రిల్ 15న ఇంటికి వ‌చ్చాడు. తాగిన మైకంలో అత‌ను గోడ సాయంతో ఇంట్లోకి వ‌స్తున్న‌ట్లు ఓ సీసీటీవీలో ఉంద‌ని పోలీసులు చెప్పారు. ఎన్డీ తివారి కుమారుడిన‌ని చెప్పుకునేందుకు రోహిత్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశాడు. కోర్టులో ఆర్నేళ్ల పాటు ఆ కేసులో పోరాటం చేశాడు. చివ‌ర‌కు డీఎన్ఏ రిపోర్ట్‌ల‌ను కూడా ప్ర‌జెంట్ చేశాడు. 2014లో ఢిల్లీ కోర్టు.. ఎన్డీ తివారి కుమారుడే రోహిత్ అని తీర్పు చెప్పింది.