NRI-NRT

లాస్ఏంజిల్స్ సిమి వ్యాలీ ప్రవాసుల సీతారామ కళ్యాణం

california los angeles simi valley telugus celebrate sri rama navami

సిమి వ్యాలీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు కుటుంబాలు కలిసి శ్రీసీతారాముల వారి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. సిమి ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన శ్రీసీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వేడుకను 700 మందికి పైగా భక్తులు వీక్షించి పరవశించి పోయారు. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించుకొని అమెరికాకి చేరుకొన్న ఉత్సవమూర్తులతో మేళతాళాల సాక్షిగా ఆడపడుచులు కోలాటంతో సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకొంది. అందంగా అలంకరించుకున్న రామ, లక్ష్మణ, హనుమంతుల వారిని, పట్టాభిషేక పాదుకలని పురుషులందరూ వేడుకతో పెళ్లి మంటపానికి ఊరేగింపుగా తీసుకొని వస్తుండగా ఆ ప్రాంగణమంతా గోవింద, రామ నామాలతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరు సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి కళ్యాణానికి మరింత శోభను జత చేశారు. శ్రీ సీతా రాముల వారి కళ్యాణం ఆద్యంతం కమనీయంగా జరిగింది. 70కి పైగా జంటలు సామూహిక కళ్యాణంలో భాగస్వామ్యులు అయ్యారు. కళ్యాణం జరుగుతున్నంతసేపు, విజయ కూనపల్లి, హైమల 40మంది సంగీత విద్యార్థులు ఆలపించిన రాముల వారి కీర్తనలు అందరిని అలరింప చేశాయి. ప్రసాద్ రాణి చేసిన వ్యాఖ్యానం పలువురికి భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణంని తలపించింది. నిర్వాహకులు రామ్ కోడితాలా, చందు నంగినేని, మనోహర్ ఎడ్మ, కుమార్ తాలింకి మాట్లాడుతూ, చిన్నప్పుడు రాముల వారి పందిరిలో ఆడుకున్న అనుభవాలు, సహ పంక్తి భోజనాలు, ఆ పండుగ వాతావరణం మళ్లీ గుర్తుకు తెచ్చేలా, మన సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ముందు తరాలవారికి అందించేలా గత 3 సంవత్సరాలుగా ఈ కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. శాస్త్రోస్తంగా పూజ నిర్వహించిన పండిట్ మార్తాండ శర్మకి ప్రత్యేకకృతజ్ఞతలు తెలుపుతూ, ఆ దంపతులిద్దరిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క వాలంటీర్‌కి, భక్తులందరికీ, దాతలకి ధన్యవాదాలు తెలుపుతూ, మహా నైవేద్యంలో సహకరించిన లీల, బిందు, శిరీష, విజయల బృందానికి, మాలలు చేసిన రూప, అద్భుతంగా పందిరిని అలంకరించిన నీలిమ బృందానికి, భోజనాదులలో ఇబ్బందులు రాకుండా చూసుకున్న సుధీర్ పెండేకంటి, కిషోర్ గరికపాటి, సునీల్ పాతకమూరి, సుధీర్ కోనేరుల బృందానికి, పూజ సామాగ్రితో సాయం చేసిన సారధి గోలే, దొరబాబు కొత్తూరు బృందానికి కళ్యాణం ఆద్యంతం రామ కీర్తనలతో అలరించిన విజయ, హైమ, ప్రసాద్ రాణి బృందానికి, కోలాటంతో అలరించిన లతా తాలింకి బృందానికి, ఆడియో, ఫోటోలో సహాయం అందించిన నాగరాజు బూదిరాజు, అజిత్ బుర్ర, వీరబాబు, మీడియా కోఆర్డినేటర్ ప్రసూనా బాసని, మిగతా వాలంటీర్స్, అనిత తోటపల్లి, అను ఓరుగంటి, అనూష సాగి, బిందు గండే, బిందు పోలవరపు, కావేరీ గూడా, చంద్రముఖి నిమ్మగడ్డ, దీప్తి పాతకమూరి, దీప్తి చిరుత, గాయత్రి, గిరిధర్ నక్కలా, హరిణి కాల్వల, హర్షదా మాదిరాజు, కిషోర్ రామదేను, కృష్ణ చిరుత, లక్ష్మి పెదిరెడ్డి, లక్ష్మి పడాల, లీల ఆగిన, మూర్తి నేమాని, నాగభూషణం, నాగరాజు బుద్ధిరాజు, నీలిమ టంగుటూరి, పద్మ నేల, ఫణి కాంత్, పుష్ప జయరాం, రాజ్ అడపా, రాజ్ గండే, రాజేష్ పెద్దిరెడ్డి, రామ గార్లపల్లి, సాయి మగాగడలా, సాయి వంకినేని, శైలజ మద్దాలి, సంతోష్ ఘంటారాం, సవిత దేవరెడ్డి, శిరీష కోడితాలా, శోభా కల్వకోట, శ్రావణి గొడిశాల,సిద్దు యాదల్లా, శిరీష గాజుల, శిరీష పొట్లూరి, శ్రవణ్, శ్రీదేవి రామదేను, శ్రీకాంత్ బండ్లమూడి, శ్రీలత తాలింకి, శ్రీనివాస్ సంపంగి, శ్రీరామ్ పడాల, సుచరిత అదేమా, సుధా దావులూరి, సుజాత కార్తికేయన్, సుమిత్ర హోసబెట్టు, సునీత పెండేకంటి, సునీత వేదాంతం, సునీత బొప్పిడి, స్వప్న పోపూరి, స్వాతి ఘంటారం, స్వాతి కుప్పిలి, ఉషశ్రీ తేజోమూర్తుల, వెంకట్ ఓరుగంటి, వెంకట నాగ ఇతర వాలంటీర్స్ అందరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
simi valley sri rama navami 2019
simi valley los angeles sri rama navami 2019 america by telugus