NRI-NRT

డెట్రాయిట్‌లో “మేమంతా సిద్ధం” సభ

డెట్రాయిట్‌లో “మేమంతా సిద్ధం” సభ

సీఎం జగన్‌ బస్సు యాత్ర, సిద్ధం సభలకు జేజేలు కొడుతున్నారు ప్రవాసాంధ్రులు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం, అభివృద్ధి ఎజెండాలుగా.. సింగిల్‌గా ఎన్నికలకు వెళ్తోన్న జగన్‌కు తమ వంతుగా మద్ధతు తెలిపారు అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు. 22 రోజులు, 2100 కిలోమీటర్లు, 16 బహిరంగ సభలు, 9 భారీ రోడ్ షోలతో సరికొత్త చరిత్ర సృష్టించిన సిద్ధం సభలకు, సీఎం జగన్‌కు సంఘీభావంగా అమెరికాలోని డెట్రాయిట్‌ నగరంలో “మేమంతా సిద్ధం సభ”ను ఘనంగా నిర్వహించారు. డెట్రాయిట్‌ వైఎస్సార్‌సిపి కార్యకర్తలు, అభిమానులు, పలువురు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇందులో పాల్గొన్నారు. సీఎం జగన్‌ పాలన అన్ని రంగాల్లో రాష్ట్రానికి మేలు చేసిందని, ఘనమైన మెజార్టీతో మళ్లీ వైఎస్‌ జగన్‌ రెండో సారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. సీఎం జగన్‌కు సంఘీభావంగా.. మేమంతా సిద్ధం అని నినదించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z