NRI-NRT

టంపాబే: ఆసుపత్రికి ₹417కోట్ల విరాళమిచ్చిన ప్రవాస తెలుగు కుటుంబం

టంపాబే: ఆసుపత్రికి ₹417కోట్ల విరాళమిచ్చిన ప్రవాస తెలుగు కుటుంబం

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాబేకు చెందిన ప్రవాస తెలుగువారైన డా.పగిడిపాటి దేవయ్య-రుద్రమ్మ కుటుంబం తమ 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానికంగా ఉన్న సెయింట్ జోసఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫౌండేషన్‌కు ₹417కోట్లు (50మిలియన్ డాలర్లు) విరాళంగా అందజేశారు.

డా. పగిడిపాటి కుటుంబ సభ్యులు సిద్ధార్థ, అమీ, రాహుల్, నేహా, సృజని, అర్జున్, ఇషాన్, ఆరియా, అరెన్ తదితరులు కూడా ఈ విరాళానికి తమవంతుగా సహకరించారు. ఈ విరాళం టంపాలో ఆరోగ్య సంరక్షణకు ఇప్పటివరకు ఇచ్చిన అతిపెద్ద విరాళాల్లో ఒకటిగా చరిత్ర సృష్టించింది. దీని ద్వారా సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో కొత్త పీడియాట్రిక్ సదుపాయం అభివృద్ధికి దోహదపడుతుంది. పిల్లల కోసం అత్యాధునిక ఆరోగ్య సంరక్షణను మరింత పెంచే వ్యూహంలో భాగంగా ఈ విరాళాన్ని ఇచ్చినట్లు డా. దేవయ్య కుటుంబం తెలిపింది.

నూతనంగా నిర్మించే ఈ పిల్లల ఆసుపత్రికి పగిడిపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎట్ సెయింట్ జోసెఫ్ అని పేరు పెట్టనున్నారు. డాక్టర్ రుద్రమ, దేవయ్యలు నాట్స్‌తో పాటు అనేక ఇతర సేవా సంస్థలకు తమ మద్దతు అందిస్తున్నారు. ఆయన దాతృత్వ స్ఫూర్తిని నాట్స్ హర్షించింది. ఆయనకు అభినందనలు తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z