NRI-NRT

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో మేడే సంబరాలు

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో మేడే సంబరాలు

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కార్మికుల సేవలను గౌరవిస్తూ మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సోదరులకు 3 వారాల పాటు స్థానిక క్రాంజి రిక్రియేషన్ సెంటర్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 11 జట్లు తలపడ్డాయి.

ఫైనల్ మ్యాచ్‌లో పుల్లన్న శ్రీనివాసరెడ్డి మద్దతు ఇచ్చిన తెలుగు స్టార్స్ టీమ్ వీరా ఫ్లేవర్స్ టీమ్ పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాపేటి జనార్థన్ మాట్లాడుతూ.. సిరీస్ లో అత్యుత్తమ ప్రతిభ చూపిన బ్యాట్స్ మాన్ (ఖాసిమ్), బౌలర్ (కామేశ్వరరావు), ఆల్రౌండర్ (సుబ్బారెడ్డి) లకి అవార్డులు ప్రదానం చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి క్రీడాకారులకు, కార్మిక సోదరులకు తెలుగు సమాజం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. పోటీల్లో గెలిచిన వారికి కప్పులు, ఫైనల్లో గెలిచిన వారికి జ్యోతిశ్వర్, బీవీవీ శ్రీనివాస్, యశ్వంత్‌లు 1000 డాలర్లు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి కేపీ వర్మ, గోపాల్ 500 డాలర్ల నగదు బహుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్, శ్రీనివాస రెడ్డి, మల్లిక్, నాగేశ్వర్, కోశాధికారి ప్రసాద్ కమీటీ సభ్యులు సమ్మయ్య, సుప్రియ, రామిరెడ్డి, రమణ, జితేందర్, గోపికిషోర్ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z