Devotional

Telugu Horoscope – May 04 2024

Telugu Horoscope – May 04 2024

మేషం
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.

వృషభం
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. రామ నామ జపం శ్రేయోదాయకం.

మిథునం
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.

కర్కాటకం
మీ మీ రంగాల్లో బాగా శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవనామస్మరణ శుభప్రదం.

సింహం
మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.

కన్య
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుఖ,సంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. శ్రీగణపతి ఆరాధన మేలు చేస్తుంది.

తుల
చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా కానీయకండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.

వృశ్చికం
ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ధనుస్సు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. శివ స్తోత్రం చదవడం మంచిది.

మకరం
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

కుంభం
ముఖ్య వ్యవహారాలలో అనుకున్నది దక్కుతుంది. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సహాయసహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాస్తోత్రం చదవాలి.

మీనం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z