NRI-NRT

డీసీ: WETA ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం వేడుకలు

డీసీ: WETA ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం వేడుకలు

వుమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు సంఘం(WETA0 ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీ మేరీల్యాండ్ ఏరియాలోని ఫ్రెడెరిక్స్ లోని ఉన్న ఓక్డేల్ మిడిల్ స్కూల్లో 18న అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

మేరీల్యాండ్ సిటి కౌన్సిల్ సభ్యురాలు రెనీ నాప్, మేరీల్యాండ్ ప్రభుత్వ ప్రతినిధి వైసీలా బ్రావొలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంస్థ వ్యవస్థాపకురాలు ఝాన్సీరెడ్డి, అధ్యక్షురాలు శైలజ కల్లూరి, WETA మేరీల్యాండ్ నుండి ప్రీతిరెడ్డి, టెక్సస్ నుండి ప్రతిమరెడ్డి, కల్చరల్ చైర్ చైతన్య పోలోజు, రీజినల్ కోఆర్డినేటర్ స్వరూప సింగరాజు, మీడియా చైర్ సుగుణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రావ్య మానస వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

జీవితంలోని అన్ని కష్టాల నుండి మనల్ని కాపాడే రక్షణ కవచం లాంటిది తల్లి అని ఝాన్సీరెడ్డి అన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను WETA ఆధ్వర్యంలో పెంపొందిస్తామని తెలిపారు. వక్తలు మాట్లాడుతూ…అమ్మ అనే పదంలో షరతులు లేని కరుణ, ప్రేమ, ధైర్యం, దయ ఇమిడి ఉంటాయని, సమాజంలో మహిళల పాత్రపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. అనంతరం రెనీ నాప్, వైసీలా బ్రావోలకు సేవా పురస్కారాలు అందించారు. స్థానిక నృత్య, సంగీత పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బహుమతులను ప్రదానం చేశారు. గాయనీ అంజనా సౌమ్య పాటలతో ప్రేక్షకులను అలరించారు. వాలంటీర్స్ గురుచరణ్ చిట్నా, మోహన్ పులిచర్ల, భాస్కర్ గంటి, అరుణ్ ఎరువ, చంద్ర తదితరులు వేడుకల విజయవంతానికి సాయపడ్డారు. “తెలుగు మహిళల కోట…స్త్రీ ప్రగతి పథమే బాట” అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే “మహిళ సాధికారతే “లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీరెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్(WETA) సంస్థను 2019లో స్థాపించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z