Devotional

రూ.16.77 కోట్ల ఆదాయం పెరిగింది

annavaram temple income in 2019 has increased

అన్నవరం దేవస్థానానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.119.48 కోట్ల ఆదాయం సమకూరింది. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ.16.77 కోట్ల ఆదాయం పెరిగింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో వ్రతాల ద్వారా రూ.29.87 కోట్లు, హుండీల ద్వారా రూ.14.67 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.25.92 కోట్లు, వసతి గదుల ద్వారా రూ.8.49 కోట్లు, సేవల ద్వారా రూ.1.05 కోట్లు, దర్శనాల ద్వారా రూ.6.08 కోట్లు, లీజులు, లైసెన్సుల ద్వారా రూ.14.75కోట్లు, ఇతరత్రా రూ.17.49కోట్ల ఆదాయం సమకూరింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.65 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేశారు.