DailyDose

మహిళా పనివారి ఏర్పాటుపై జస్టిస్ గొగొయికు వినతులు

supreme judges request ranjan gogoi to remove female workers from their offices and homes

తమ నివాస కార్యాలయాల్లో మహిళా సిబ్బందిని నియమించవద్దంటూ పలువురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సీజేకి అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. ఓ జాతీయపత్రికలో వెలువడ్డ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం తేనీటి విరామసమయంలో ఇష్టాగోష్టిగా కలిసిన జడ్జీలు…ఈ విషయమై సీజే రంజన్‌ గొగోయ్‌ను అభ్యర్థించారు. నివాస-కార్యాలయాల్లో పురుషులతో సమానంగా మహిళా ఉద్యోగులు కూడా రాత్రి పొద్దుపోయేదాకా పనిచేస్తూంటారని. సీజేకు ఎదురైన పరిస్థితిలాంటిది తలెత్తకుండా చూసుకోవాలంటే తమ ఇళ్ల వద్ద వారిని నియమించడం మంచిది కాదని వారు పేర్కొన్నట్లు ఆ పత్రిక రాసింది. అయితే సుప్రీం సిబ్బందిలో 60 శాతం మంది మహిళా సిబ్బందే ఉన్నారని, జడ్జీల వినతిని సమ్మతించడం సాధ్యం కాదని సీజే అన్నట్లు తెలిసింది. ఈ అంశంపై చర్చ జరగాలని ఆయన వారితో అన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది.