*** నేడు నాల్గో దశ పోలింగ్
– 9 రాష్ట్రాలు, 72 స్థానాలు
– ఒరిస్సాలో 42 అసెంబ్లీ స్థానాలు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నాల్గో దశ పోలింగ్ నేడు(సోమవారం) మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నది. తొమ్మిది రాష్ట్రాల్లో 72 స్థానా ల్లో పోలింగ్ జరగనున్నది. ఒరిస్సాలో 42 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. బీహార్(5), జార్ఖండ్ (3), మధ్యప్రదేశ్(6), మహారాష్ట్ర(17), ఒరిస్సా(6), ఉత్తరప్రదేశ్(13), పశ్చిమ బెంగాల్(8), రాజస్థాన్ (13), జమ్మూ కశ్మీర్(1) పోలింగ్ జరుగుతుంది. జమ్మూ కశ్మీర్‌లో సమస్యాత్మక అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో జరుగుతుంది. అందులో మూడో దశలో అనంత్‌నాగ్(మొదటి దశ)లో జరిగింది. నేడు జరిగే నాల్గో దశలో కుల్‌గామ్(రెండో దశ)లో పోలింగ్ జరగనున్నది. అలాగే మిగతా ప్రాంతాల్లో ఐదో దశ (మే 6)లో పోలింగ్ జరగనున్నది. 72 స్థానాల్లో 14 ఎస్సీ, 9 ఎస్టీ, 49 జనరల్ కేటగిరి స్థానాలున్నాయి. ఈ దశలో 12,79,58,477 మంది ఓటర్లు కాగా, అందులో పురుషులు 6,73,22,777, మహిళలు 6,06,31,574, థర్డ్ జండర్స్ 4,126 ఓటర్లు ఉన్నారు. నాల్గో విడత పోలింగ్‌లో 961 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ నిర్వహణకు 1,40,849 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.