WorldWonders

శ్రీకాకుళంలో పందుల కోసం తయారుచేస్తున్న నాటుబాంబుల పేలుడు

srikakulam bomb explosion

–పేలిన నాటుబాంబులు
–తొమ్మిది మందికి తీవ్ర గాయాలు
–ఇద్దరి పరిస్థితి విషమం
–విశాఖకు తరలింపు చర్యలు
–పేలుడు దాటికి పూర్తిగా ద్వంసమైన ఇళ్ళు ,
–గ్యాస్‌ సిలిండర్‌ పేలిందంటూ కహానీ
–కాదంటున్న అగ్నిమాపక అధికారులు
–పందుల వేట కోసం నాటుబాంబులు తయారుచేస్తుండగా ఘటన
–బాంబులను సమీపంలోని చెరువులో పడేసినట్లు వాదన
–యాతపేటలో కలకలం రేపిన పేలుడు
–దర్యాప్తుచేస్తున్న పోలీసులు

శ్రీకాకుళం నగర శివార్లలోని యాతపేటలోని ఓ ఇంటిలో బుదవారం నాటు బాంబులు పేలుడు చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓ ఇంటిలో వాటిని తయారు చేస్తుండగా ప్రమాధవసాత్తు పేలిపోవడంతో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం శ్రీకాకుళంలోని రిమ్స్ కి హుటాహుటిన తరలించారు.వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించే చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనలో ఒక ఇల్లు పూర్తిగా ద్వంసం కాగా మరో ఇళ్లు దెబ్బతింది.ఈఘటన స్థానికంగా భయాందోళనలను సృష్టించింది. స్థానికులు,పోలీసులు,అగ్నిమాపక శాఖ అధికారుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.నగర శివార్లలోని నవభారత్ జంక్షన్ కి వెళ్లే త్రోవలో ఉన్న యాతపేటలో జమ్మల పెంటమ్మకి చెందిన ఇంటిలోఎద్దుమంటి రమణ,లక్ష్మీలు గత కొన్నాళ్లుగా అద్దెకి ఉంటున్నారు. వారి ఇంటిలో బుదవారం మద్యాహ్నం ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది.ఆ ఇళ్లు మొత్తం తునాతునకలైంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పిల్లలు,పెద్దలు కలిసి తొమ్మిది మందిగాయపడ్డారు. రమేష్ ,పెంటమ్మ,శ్రీలక్ష్మి,దుర్గాప్రసాద్ ,రమణ,రాజు,సందీప్ ,అప్పన్న,నితిన్ అనే ఏడాదిన్నర చిన్నారికి కూడా తీవ్రగాయాలయ్యాయి. ఇంట్లోని వారంతా పందుల వేటకి వినియోగించడం కోసం నాటు బాంబులు తయారుచేస్తుండగా ఈ ఘటన సంభవించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గత కొంతకాలంగా వారు వాటిని తయారు చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు.ఈ క్రమంలో వారు తయారీలో నిమగ్నమై ఉండగా ఊహించన విదంగా ప్రమాధం జరిగి భారీ పేలుడు సంబవించిందని వారు స్పష్టం చేస్తున్నారు.ఈ ప్రమాధ ఘటనలో పురుషులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని స్థానికులు తెలిపారు.ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండెర్ పేలిదంటూ తప్పుడు ప్రచారం చేయగా పేలుడు సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చిన అగ్నిమాపక శాఖ అధికారులు మాత్రం అటువంటి ఆనవాళ్లు లేవని తేల్చిచెప్పారు. పేలుడుకి కారణం గ్యాస్ సిలిండెర్ కాదని పేర్కోన్నారు. అయితే నాటు బాంబు పేలుడు కాదని నమ్మించేందుకు స్థానికులు అప్పటికే మిగిలి ఉన్న వాటిని సమీపంలోని చెరువులో పారవేసినట్లుగా కూడా స్థానికులు చెబుతున్నారు. నిత్యం అక్కడ నాటు బాంబులను తయారు చేస్తుంటారని ఆ విషయం పోలీసులకి కూడా తెలుసునని వారు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకొకపోవడం వల్లనే ఈ పేలుడు ఘటన చోటుచేసుకుందని ద్వజమెత్తున్నారు. భారీ పేలుడు సంభవించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణను చేపట్టారు. పేలుడుకి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.