Movies

అత్యాచారం కేసులో అరెస్ట్

Bollywood Actor Karan Oberoi Arrested Over Rape Allegations

ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడి.. ఆమెను వేధిస్తున్నందుకు బాలీవుడ్‌ బుల్లితెర నటుడు కరణ్‌ ఒబెరాయ్‌ను ఆదివారం ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముంబయికి చెందిన ఓ మహిళకు, కరణ్‌ ఒబెరాయ్‌కు 2016 నుంచి సంబంధం ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమెను పెళ్లి చేసుకోమన్నందుకు సదరు మహిళపై అతడు బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అతడితో ఆ మహిళ సన్నిహితంగా ఉన్న వీడియోలను చిత్రీకరించి, డబ్బులు ఇవ్వకపోతే వాటిని బయటకు విడుదల చేస్తానని వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై సెక్షన్‌ 376, 384 కింద కేసులు నమోదు చేశామని ఓశ్విర పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శైలేష్‌ పసల్వాద్‌ తెలిపారు. కరన్‌ ఒబెరాయ్‌ ‘జస్సి జైసి కొయి నాహిన్‌’, ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ లాంటి సీరియళ్లలో నటించారు. కొన్ని ప్రకటనల్లోనూ నటించారు.