నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయంలో మరో వివాదం చెలరేగింది. ఆలయంలో అమ్మవారికి అలంకరించే బంగారు కిరీటంలోని మరకతం (పచ్చ) గత కొంతకాలంగా కనిపించటం లేదు. 2006లో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించారు. ప్రతిరోజు అభిషేకం అనంతరం అమ్మవారికి బంగారు కిరీటం అలంకరిస్తారు. కిరీటంలో నాలుగు మరకతాలు, నాలుగు వజ్రాలు, ఒక కెంపు పొదిగి ఉన్నాయి. అందులో ఒక పచ్చ గత కొంతకాలంగా కనిపించటం లేదు. అమ్మవారి అభిషేక పూజ సమయాల్లో ఊడిపోయినట్లు ఆలయం అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో సంధ్యారాణి తెలిపారు. మరోవైపు, ఈ వ్యవహారంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
బాసర సరస్వతి అమ్మవారి కిరీటంలో మరకతం మాయం
Related tags :