WorldWonders

శంషాబాద్ విమానాశ్రయంలో మరో వింత

Passengers still think samshabad airport vigilance is so weak or stupid

శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన సీఐఎస్ఎఫ్‌ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న థామస్‌ అనే ప్రయాణికుడు సరైన పత్రాలు లేకుండా రూ.3కోట్లు తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. థామస్‌ను పోలీసులకు అప్పగించినట్లు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో తరచు బంగారం పట్టుబడుతున్నా.. ఇటీవల కాలంలో భారీగా నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి.