Movies

డిసెంబ‌ర్ 17,2021న

Here is what you should know about the upcoming avatar-2 movie release date and interesting facts

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవ‌తార్ చిత్రం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

అవతార్ సినిమా ఏ రేంజ్లో రికార్డులు కొల్లగొట్టిందో అందరికీ తెలిసిన విషయమే. 2009లో సామ్ వార్తింగ్టన్, జోయే సల్దనాతోపాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో వచ్చిన అవతార్ అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డులు సాధించింది.

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలో విహరింపజేసిన అవతార్ సినిమా సీక్వెల్స్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘అవతార్‌ 2, అవతార్‌ 3, అవతార్ 4, అవ‌తార్ 5’ చిత్రాల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌నుకున్న కామెరూన్ ప్ర‌స్తుతం అవతార్‌ 2, అవతార్ 3 చిత్రాల‌కి సంబంధించి షూటింగ్ జ‌రుపుతున్నాడు.

ఇటీవ‌ల‌ అవతార్ ఫ్యామిలీలోకి ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ ఫేమ్‌ ఆస్ట్రేలియన్‌ యాక్టర్‌ బ్రెండెన్‌ కోవెల్‌ను తీసుకున్నారు.

రచయితగా, దర్శ కుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రెండెన్ అవ‌తార్ ఫ్యామిలీలోకి ఎంట‌ర్ కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.

పండోరా గ్రహంలో కెప్టెన్‌ మిక్‌ స్కార్స్‌బీ పాత్రలో కనిపిస్తారాయన.

ప్రస్తుతం లైవ్‌ యాక్షన్‌ సీన్స్‌ను న్యూజిలాండ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించే పనిలో పడ్డారట ‘అవతార్‌’ టీమ్‌.

అయితే అవతార్ 2 చిత్రం డిసెంబర్ 18, 2020 న విడుదల అవుతుందని గత కొంత కాలమే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

కాని తాజాగా చిత్రాన్ని డిసెంబ‌ర్ 17,2021న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు .

మ‌రి మిగ‌తా పార్ట్‌ల‌ని ఎప్పుడు విడుద‌ల చేస్తారో చూడాలి.