Food

వేసవి ఎండల తాట తీసే తాటి ముంజలు

Palm Fruit Helps Beat Summer Heat

ప్రకృతి నుండి వేసవిలో లభ్యమయ్యే ముఖ్యమైన పండ్లలో మామిడి పండ్లను అందరూ ఎంతోఇష్టంగా తింటారో తాటి ముంజలను కూడా ఆవిధంగా ఇష్టపడతారు. మండే ఎండల్లో తాజా మంజలను తింటే ఆ మజాయేవేరు. వీటివల్ల శరీరానికి చల్లదనమేకాదు, కీలకమైపోషకాలు కూడా అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూమవుతాయి. ముంజలు లభించే గ్రామాలలో దొరుకుతాయో లేదోగానీ తి రువూరు లాంటి పట్టణాలలో మార్చి మొదటివారం నుండే ప్రత్యేక్షమవుతున్నాయి. విక్రయదారులు రోడ్ల వెంట ముంజలున్న తాటికాయలను గుట్టలు గుట్టలుగాపోసి వాటి నుండి లేతముంజలు బయటకుతీసి ముంజల ప్రియులను నోరూరిస్తున్నారు. ఇంతంటిప్రాధాన్యత ఉన్న వీటిని విక్రయదారులు డజన్‌ రూ.25 నుండి 30 వరకు డిమాండ్‌నుబట్టి విక్రయిస్తున్నారు. మండుతున్న ఎండలనుంచి ఉపశమనం పొందేం దుకు ముంజలు ఎంతగానో దోహపడ్తాయి. ఎండాకాలం వచ్చిందంటే శీతలపానీయాలు, జ్యూష్‌, నిమ్మ, చెరకు రసాలు, లస్సీ, చల్లని ఫ్రిజ్‌ వాటర్‌ను తీసుకొని దాహార్తిని తీర్చుకునేవారు. అయితే వీటిల్లో కొన్ని కలుషితమైనవి కూడా ఉన్నాయి. కానీ ప్రకృతి నుండి వచ్చిన తాటి ముంజలు ఏవిధమైన కలుషితం లేక పోవడంతో వాటికోసం విక్రయదారుల వద్ద ప్రజలు పోటిపడుతున్నారు. ముంజలు గణపదార్ధమైన ప్పటికి వాటిలో మనిషిని ఎండవేడిమి నుండి రక్షించే విటమిన్లు, పోషకపదార్ధాలు ఎక్కువస్ధాయిలో ఉండటంతో తాటి ముంజలను తినేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముంజలు నోటికి ప్రత్యేక మైన రుచినిస్తాయి. దీనితో వీటికి ఎక్కువమంది మక్కవ చూపడంతో విక్రయదారులు ఒక్కొప్రదేశంలో ఒక్కో విధమైన ధరతో అమ్ముతారు. కొంతమంది కాయనుండి ముంజలు ధర ఎక్కువగా ఉందనిచెప్పి మూడు ముంజలున్న తాటి ముంజకాయను రూ.10కి కొనుగోలు చేస్తున్నారు. మొత్తానికి ముంజలు తిన డంతో ఎన్నోలాభాలున్నందున పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు మరీ ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ముంజలు తింటే కలిగే ఉపయోగాలు: పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పతుంది. రక్లపోటు అదుపులో ఉంటుది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రా బయటకు పోయి మంచి కొలెస్ట్రా వృద్ధిచెందుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. వేసవిలో అధిక ఉష్టోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖర్చవుతుంది. దీనితో డిహైడ్రేషన్‌ బారినపడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో ముంజలను తీసుకుంటే శరీరంలోకి ద్రవాలుచేరి డీహైడ్రేషన్‌ బారి నుండి తప్పించు కోవచ్చు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అసిడిటీ, మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు. శరీరం వేడిగావున్న వ్యక్తులు తాటి ముంజలు తింటే ఫలితం ఉంటుంది. శరీరానికి అవసర మైన విటమిన్‌ ఎ,బి.సి. ఐరన్‌ జింక్‌, పాస్ఫరస్‌, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటా యి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. తాటి ముంజలలో పొటాషియం శరీరంలోని విషతు ల్యాలను బయటకు పంపుతుంది. దీనితో శరీరం అంతర్గతంగా శుభ్రవముతుంది. వేసవి కారణంగా వాంతలు, విరేచనాలు బారినపడేవారికి తాటి ముంజలను తినిపిస్తే ఆసమస్య నుండి ఉపశమనం లభి స్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులలకు ఇవి ఎంతో మేలుచేస్తా యి. రొమ్ము కేన్సర్‌తో పాటు ఇతర కేన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు ఈముంజలలో ఉన్నాయి. గుండె, అధిక బరువు సమస్య ఉన్నవారు కూడా వీటిని నిర్భభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చుని నిపు ణులు సైతం చెబుతున్నారు