WorldWonders

హాంగ్‌కాంగ్ ప్రజాప్రతినిధులు చట్టసభలో తన్నుకుచచ్చారు

HongKong Politicians Fight In Parliament Over More Power Deliverance To China

హాంగ్‌కాంగ్‌లో చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధులు కొట్టుకున్నారు. శాస‌న‌మండ‌లిలోనే వాళ్లు త‌న్నుకున్నారు.

వివాదాస్ప‌ద అప్ప‌గింత చ‌ట్టంపై రెండు వ‌ర్గాలు లెజిస్లేచ‌ర్ కౌన్సిల్ చాంబ‌ర్‌లోనే బాహాబాహీకి దిగాయి.

ప్ర‌జాస్వామ్య అనుకూల‌వాదులు, చైనా అనుకూల‌వాదుల మ‌ధ్య .. వివాదాస్ప‌ద అప్ప‌గింత చ‌ట్టం గురించి ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది.

వాణిజ్య న‌గ‌ర‌మైన హాంగ్‌కాంగ్ ప్ర‌స్తుతం చైనా ఆధీనంలోనే ఉన్న‌ది.

అయితే చైనాకు మ‌రిన్ని అద‌న‌పు అధికారాలు క‌ల్పిస్తూ తాజా చ‌ట్టాన్ని త‌యారు చేశారు. దీంతో రెండు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.

ఆ పెనుగులాట‌లో ఓ నాయ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఒక‌ప్పుడు బ్రిటీష్ ఆక్ర‌మిత ప్రాంతంగా ఉన్న హాంగ్‌కాంగ్‌.. 1997లో మ‌ళ్లీ చైనా ఆధీనంలోకి వెళ్లింది.

అయితే తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన ఎక్స్‌ట్ర‌డిష‌న్ చ‌ట్టంపై విడివిడిగా వాద‌న‌లు వినాల‌ని రెండు వ‌ర్గాలు డిమాండ్ చేశాయి.

అక్క‌డ త‌లెత్తిన వివాదం కార‌ణంగా.. చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధులు ఒక‌రిపై ఒక‌రు ముష్టియుద్ధానికి దిగారు.

అప్ప‌గింత చ‌ట్టానికి వ్య‌తిరేకంగా గ‌త కొన్ని వారాలుగా హాంగ్‌కాంగ్‌లో భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.