NRI-NRT

తెలుపు నగరంలో తెరలేచిన తెలుగు తిరునాళ్లు-TNI ప్రత్యేకం

2019 TANA 22nd Conference Begins With 8000 Audience Banquet In Washington D.C.,Power Star Pawan Kalyan And SS Rajamouli Reach DC To Attend TANA 2019 Conference,2019 22nd TANA Washington DC Banquet Gallery Special By TNILIVE, 2019 22nd TANA Washington DC Day1 Gallery Special By TNILIVE, 2019 22nd TANA Washington DC Day2 Gallery Special By TNILIVE, TANA 2019 Awards List Is Here, District NRIs Meet At 22nd TANA 2019 Conference In Washington DC, krishna nris meet at tana 2019, chittoor nris meet at tana 2019, godavari nris meet at tana 2019, tana 2019 donors list, tana 2019 history, the comprehensive history of tana telugu association of north america history by narisetti innaiah, innaiah narisetti tana history telugu, Pawan Kalyan To Grace 2019 TANA 22nd Conference In Washington DC,TANA 2019 Co-Ordinator Dr.Mulpuri VenakataRao Requests Donors To Deposit Funds,kishan reddy to tana 2019 conference in washington dc, kishan reddy to tana 2019 conference in washington dc 22nd tana conference, Chicago TANA Team Donates 8000USD Towards 22nd TANA Conference In Washington DC,ys jagan 2019 tana dc conference, chandrababu tana 2019 washington dc conference, nandamuri balakrishna at tana 2019 washington dc conference, tana 2019 washington dc conference political guests list, new jersey tana 2019 breaks records, tana 2019 fund raiser in new jersey new york, royal albert palace tana 2019 fund raiser, tana 2019 fund rising in new jersey by telugus, Maryland NRI NRT Telugus Donate To TANA 2019 Washington DC 22nd Conference, tana 2019 maryland donations, tana 2019 22nd washington dc conference maryland telugu news,tana2019,tana 2019, 2019 tana 22nd conference washington dc news galleries gallery videos photos, 2019 tana 22nd convention washington dc news galleries gallery videos photos, 2019 tana 22nd meeting washington dc news galleries gallery videos photos, 2019 tana 22nd biennial convention washington dc news galleries gallery videos photos, telugu association of north america tana 2019 washington dc convention,telugu association of north america tana 2019 washington dc convention gallery, telugu association of north america tana 2019 washington dc convention news, telugu association of north america tana 2019 washington dc convention videos, telugu association of north america tana 2019 washington dc convention fundrising, telugu association of north america tana 2019 washington dc convention schedule, telugu association of north america tana 2019 washington dc convention guestlist, telugu association of north america tana 2019 washington dc convention vemana satish, telugu association of north america tana 2019 washington dc convention mulpuri venkatarao, telugu association of north america tana 2019 washington dc convention kodali naren, telugu association of north america tana 2019 washington dc convention yadla hemaprasad, telugu association of north america tana 2019 washington dc convention tana, telugu association of north america tana 2019 washington dc convention telugu convention usa, telugu association of north america tana 2019 washington dc convention america news, telugu association of north america tana 2019 washington dc convention gallery, tana 2019 gallery, tana 2019 gallery, tana 2019 washington dc news, tana 2019 vemana satish speech, tana 2019 mulpuri venkatarao, tana 2019 telugu association of north america washington DC convention conference telugu sabhalu mahasabhalu tana2019 news, tana 2019 telugu association of north america washington DC convention conference telugu sabhalu mahasabhalu tana2019 gallery,  tana 2019 telugu association of north america washington DC convention conference telugu sabhalu mahasabhalu tana2019 videos, tana news today, tana latest news, tana 2019 washington dc latest news, tana 2019 washington dc telugu association of north america tana 2019 conference updates, tana 2019 washington dc telugu association of north america tana 2019 conference banquet photos, tana 2019 washington dc telugu association of north america tana 2019 conference first day schedule, tana 2019 washington dc telugu association of north america tana 2019 second day schedule, tana 2019 washington dc telugu association of north america tana 2019 closing day schedule, tana 2019 washington dc telugu association of north america tana 2019 guests list, north america telugu news, north america latest telugu news, north america conference, north america convention, detroit team fundriser for tana 2019 conference convention meeting washington dc, detroit tana team rises 400K for washington dc convention, dallas tana team rises 301K USD towards tana 2019 conference in washington dc

శ్వేతసౌధ నగరి అమెరికా రాజధానిగిరి వాషింగ్టన్ డీసీలో ఐక్యత-నైపుణ్యం-పురోగమనం నినాదంతో 22వ తానా మహాసభలు వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో గురువారం సాయంకాలం 8వేల మంది ప్రవాస అతిథుల నడుమ బ్యాంక్వెట్ విందుతో వైభవంగా ప్రారంభమయ్యయి. సినీ, రాజకీయ, సాహిత్య, నాటక, శాస్త్ర, సాంకేతిక, వాణిజ్య, వైద్య, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రముఖ వ్యాఖ్యాత్రి సుమ వ్యాఖ్యానంలో ప్రారంభమయిన ఈ వేడుకల్లో తానా అధ్యక్షుడు వేమన సతీష్ స్వాగతోపన్యాసం చేశారు. అమెరికా ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న నేటి సాయంకాలం వారి సంబరాలకు తోడుగా తానా ఆధ్యర్యంలో 1983లో, 2007లో జరుపుకున్న తానా మహాసభల లానే 2019లో నేటి సాయంత్రం ఇంతమంది ప్రవాసుల నడుమ ఈ వేడుకలు జరుపుకోవడం, అమెరికా సంస్కృతిలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని అన్నారు. సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావు మాట్లాడుతు ఎందరో కార్యకర్తల కృషి ఫలితమే నేటి తానా సభల విజయమని, వచ్చే రెండు రోజులు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించామని వాటిని అందరూ ఆస్వాదించాలని కోరారు.

* నమస్తే అంటూ కపిల్‌దేవ్ ప్రసంగం
భారత క్రికెట్ జట్టు మాజీ సారధి, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు కపిల్‌దేవ్ తానా 22వ సభల బ్యాంక్వెట్ విందులో సందడి చేశారు. ఆయనను వేదికపైకి ఆహ్వానించి ప్రసంగించవల్సిందిగా కోరగా ఆయన నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ప్రాంభించగా సభికులు హర్షధ్వానాలతో ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సభలు విజయవంతం కావాలని, తెలుగువారి మధ్య ఇలా సరదాగా గడపడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

* తానా వేదికపై పలు పార్టీల నేతలు
తానా-తెలుగు రాజకీయాలు ఇవి రెండు జంటకవలలని ప్రతి ప్రవాసుడికి తెలుసు. అందుకే 22వ తానా సభల్లో పలు పార్టీలకు చెందిన రాజకీయనాయకులు ఒకే వేదికపైకి జేరి సందడి చేశారు. మల్లు భట్టి విక్రమార్క, కామినేని శ్రీనివాస్, నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాస్, పయ్యావుల కేశవ్, రసమయి బాలకిషన్, వసంత కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్‌రెడ్డి, సీ.ఎం.రమేష్, మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, తాళ్లూరి పంచాక్షరయ్య తదితరులు ఒకే వేదికపైకి వచ్చి తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావానికి చిహ్నంగా ప్రవాసులకు, తానా సభల కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

* కళాకారుల హడావుడి
సహజంగా అమెరికాలో తెలుగు సంఘాలంటేనే సినీ కళాకారుల సందడి అధికంగా ఉంటుంది. అందులో తానా సభల్లో దాని స్థాయి మరో మెట్టు పైనే ఉంటుంది. నటీనటులు పవన్‌కళ్యాణ్, ఎస్.ఎస్.రాజమౌళి, పూజ హెగ్డే, సునీల్, అల్లరి నరేష్, నారా రోహిత్, జయప్రకాశ్‌రెడ్డి, శివారెడ్డి, ఆర్పీ పట్నాయిక్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని అభిమానులతో సరదాగా ఫోటోలు తీసుకున్నారు.

* వివిధ రంగాల ప్రముఖులకు పురస్కారాలు
తానా బ్యంక్వెట్‌లో పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందించి సత్కరిస్తారు. ఈ క్రమంలో నేటి 22వ తానా మహాసభల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పురస్కారాలను కపిల్‌దేవ్ చేతుల మీదుగా అందించారు. పురస్కారాలు అందుకున్న వారిలో అడపా ప్రసాద్(సామాజిక సేవ), రాపాకా రావు(శాస్త్ర సాంకేతిక), తాతా ప్రకాశం(పర్యావరణం), వల్లేపల్లి శశికాంత్(వాణిజ్యం), పండ ప్రసాద్(రాజకీయం-కెనడా), బండ్ల హనుమయ్య(సామాజిక సేవా), అనురాధ నెహ్రూ(శాస్త్రీయ నృత్యం), కలశపూడి వసుంధర(వైద్యం), రామినేని ధర్మప్రచారక్(సామాజిక సేవా), మృణాళిని సదానంద(శాస్త్రీయ నృత్యం), ప్రసాద్ కునిశెట్టి(సామాజిక సేవా), అట్లూరి స్వాతి(శాస్త్రీయ నృత్యం), నందిగామ కుమార్(తానా సేవలు), తాలిక స్నేహ(మీడియా), జెజ్జల కృష్ణమోహనరావు(తెలుగు భాషా సేవా), చల్లా ససల్ల(సామాజిక సేవా), లింగా లక్ష్మీ(సామాజిక సేవా), చల్లా జయంత్‌రెడ్డి(పెట్టుబడి), గంగవరపు రజనీకాంత్(వాణిజ్యం), నలజుల నాగరాజు(సామాజిక సేవా), కావ్య కొప్పరపు, వోలేటి సందీప్, నైషా బెల్లం, మలిశెట్టిలకు యువత పురస్కారాలను తానా సభల కన్వీనర్ డా.మూల్పూరి వెంకటరావు, అవార్డుల కమిటీ చైర్మన్ శీలమనేని గోపాల్, బొబ్బ రాం, కరుసాల సుబ్బారావుల సంయుక్త ఆధ్వర్యంలో అందించారు.  ఈ వేడుకలకు స్థానిక తెలుగు సంఘం అయిన బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ పర్యవేక్షణలో సహ-ఆతిథ్యం అందించింది. ఈ వేడుకల్లో తానా సభల చైర్మన్‌తో డా.నరేన్ కొడాలితో పాటు, సంస్థ ప్రతినిధులు పొట్లూరి రవి, లావు అంజయ్య చౌదరి, తాళ్లూరి జయశేఖర్, మందలపు రవి, పంత్ర సునీల్, చండ్ర దిలీప్, కిరణ్ చౌదరి, కొల్లా అశోక్, కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్, డా.యడ్ల హేమప్రసాద్, డా.రాజా తాళ్లూరి, చలపతి కొంద్రుకుంట, మురళీ వెన్నం, మురళీ తాళ్లూరి,  ఉప్పుటూరి రాంచౌదరి, సూరపనేని రాజా,  యాశ్ బొద్దులూరి, సుగన్ చాగర్లమూడి, పోలవరపు శ్రీకాంత్, ఆరోగ్య నిపుణులు వీరమాచినేని రామకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎల్లా కృష్ణ, సుచిత్ర ఎల్లా, బెంగుళూరుకు చెందిన వైద్యురాలు డీ.ఎ.తేజస్విని(డీ.కె.ఆదికేశవులునాయుడు కుమార్తె), సాహితీవేత్తలు లెనిన్‌బాబు, వాసిరెడ్డి నవీన్, టాంటెక్స్ మాజీ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం, అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు పరమేశ్ భీమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.