DailyDose

కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాం-నేరవార్తలు-01/10

Kodela Sivaram Surrenders | TNILIVE Telugu Crime News Today-10/01

*నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం మంగళవారం లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల, ఆయన కుటుంబంపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాము ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటూ కోడెల తనయుడు శివరాం ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ఆయన ఇవాళ కోర్టులో లొంగిపోయి. మరికొద్ది సేపటిలో బెయిల్ ద్వారా బయటకు రానున్నారు…
*తిరుపతి చిన్న బజారు వీధిలోని లలితా మెడికల్ స్టోర్‌లో మంగళవారం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొన్ని క్షణాల్లోనే.. లలితా మెడికల్ స్టోర్‌తో పాటు పక్కనే ఉన్న కూల్‌డ్రింక్‌ షాపు పూర్తిగా కాలి బూడిదగా మారాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, బతుకుజీవుడా అంటూ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
*మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లాలో హృదయాన్ని కలచివేసే సంఘటన చోటుచేసుకుంది. తినడానికి తిండి దొరక్క ఓ ఎనిమిదేళ్ళ బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా అతని కుటుంబంలోని మిగతా ఐదుగురు వాంతులు, డయేరియాతో హాస్పిటల్లో చేరారు.
* అనంతపురం సోమందేపల్లి మండలం పేటకుంట సమీపంలో హైవే పై రోడ్డు ప్రమాదం.బెంగళురు నుంఢి అనంతపురం వైపు వెళ్తున్న కారును ఢీ కొన్న ఐచర్.ముగ్గురుకి గాయాలు ఆసుపత్రికి తరలింపు..ఐచర్ రాంగ్ రూటులో వచ్చినట్టు సమాచారం.
* చిన్న బజారు వీధిలోని లలితా మెడికల్ స్టోర్‌లో మంగళవారం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొన్ని క్షణాల్లోనే.. లలితా మెడికల్ స్టోర్‌తో పాటు పక్కనే ఉన్న కూల్‌డ్రింక్‌ షాపు పూర్తిగా కాలి బూడిదగా మారాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, బతుకుజీవుడా అంటూ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా షార్టుసర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు
*భద్రతా బలగాల అప్రమత్తతతో ఉగ్రవాదుల భారీ దాడి కుట్ర భగ్నమైంది. జమ్మూలోని ఓ బస్టాండ్‌ సమీపంలో నిలిపి ఉంచిన ఓ బస్సు నుంచి 15 కిలోల ఆర్డీఎక్స్‌ను బలగాలు మంగళవారంనాడు స్వాధీనం చేసుకున్నాయి.
*తమిళనాడులోని విఝుపురమ్ జిల్లా నెజిల్‌కోండమ్ గ్రామంలోని మినీ వాహనంలో బాణసంచా పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వీరస్వామి తన కంపెనీ నుంచి బాణసంచా పెద్ద మొత్తంలో మినీ వ్యాన్‌లో పుదేచ్చెరి నుంచి తిరువన్నమలాయ్ జిల్లాకు తరలిస్తున్నారు.
* సత్యవేడు బలిజవీధికి చెందిన చెంచురామయ్య, కవిత దంపతుల కుమార్తె స్వప్న (16) బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందింది. సత్యవేడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలో స్వప్న ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సిఈసి చదువుతుంది. తమ కుమార్తె కనిపించడం లేదని తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.
* గుంటూరు జిల్లా తెనాలిలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ అంకిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం తెనాలి బ్రాంచ్ కు డిప్యూటీ మేనేజర్ గా అంకిరెడ్డి వచ్చాడు. పై అధికారుల వేధింపులే తన భర్త ఆత్మహత్యకు కారణమని భార్య ఆరోపిస్తోంది.
*పశ్చిమగోదావరి జిల్లాచింతలపూడి మండలంపాత బస్టాండ్ సమిపంలో ఈ రోజు నుంచి ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న APSBCL వైన్ షాపు NO-63 వద్ద సిబ్బందికి మందుబాబులకు మధ్య వాగ్వాధం.ఎంఆర్ యంపి కంటే అధనంగా ఎక్కువ రేటు అమ్ముతున్నారని ఆందోళన
*తూ…గో తుని పట్టణంలో స్థానిక ఆంధ్ర రత్న రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ద్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో మహిళల ధర్నా .
*గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం లోని నారాయణపురం లో కొత్తగా ఓపెన్ చేయుటకు సిద్ధం చేసిన మందు షాప్ ను అడ్డుకున్న మహిళలు, ధర్నా కి దిగిన గ్రామ ప్రజలు
*చిలకలూరిపేట ఎన్టీఆర్‌ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం లో మిషన్ భగీరథ పనుల కోసం ఉపయోగించే నల్లాలు సుమారు ఎనిమిది లక్షల విలువగల నల్లాలు అపహరణకు గురైనట్లు, మిషన్ భగీరథ RWS JE రమేష్ నాయక్ ఫిర్యాదు. ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చెసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు ఎస్సై తెలిపారు…
* భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్‌ తనువు చాలించింది. ఈ విషాద ఘటన సోమవారం నెల్లూరునగరంలో చోటు చేసుకుంది. పోలీసు కార్యాలయంలోని కమ్యూనికేషన్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేసే నాగలక్ష్మి(26) ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
* ఝార్ఘండ్ రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 13 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
*గుజరాత్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. బనస్కాంత జిల్లాలోని అంబాజీ పట్టణంలోని త్రిశూలియ ఘాట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న ప్రైవేటు లగ్జరీ బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా తిరగబడింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మంది గాయపడ్డారు.
*విజయవాడ సమీపంలోని ఎనికేపాడులో ఉన్న ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయంలో, తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
*తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం జి.మేడపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించి 9మంది తీవ్రంగా గాయపడ్డారు.
*మద్రాసు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తహిల్ రమణిపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. మేఘాలయ హైకోర్టుకు బదిలీ వ్యవహారంపై పునఃపరిశీలనకు కొలీజియం నిరాకరించడంతో జస్టిస్ తహిల్ రమణి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
*పిడుగుపాటుకు రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కొత్త రెడ్యాల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గాంధీ క్రిష్ణయ్య(30) తన వ్యవసాయ బావి వద్దకు వెళుతున్న సమయంలో భారీ వర్షం రావడంతో చెట్టు కిందకు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు
*ఈడీ కేసు ఎత్తివేయడానికి లంచం అడుగుతూ తనను వేధిస్తున్నారని లియో మెరిడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మాజీ ఛైర్మన్ చక్రవర్తిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారి పేరు చెప్పి ఒక వ్యక్తి తనను రూ.5-6 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
*భారీ వర్షాల కారణంగా ఓ ప్రయివేటు బస్సు అదుపు తప్పడంతో 21 మంది మరణించిన దుర్ఘటన సోమవారం గుజరాత్లో చోటుచేసుకుంది. మరో 50మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. బనాస్కాంఠా జిల్లా అంబాజీ పట్టణానికి సమీపంలోని త్రిశూలియా ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది
*నీటిలో మునిగిపోతున్న సోదరుడిని కాపాడాలన్న తాపత్రయం అన్నాచెల్లెళ్లను బలిగొంది. ఈత రాకున్నా సాహసించి తమ్ముడిని కాపాడగలిగినా వారు మాత్రం అసువులు బాశారు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్లో సోమవారం చోటు చేసుకుంది.
*బాణసంచా తయారీ కేంద్రంలో పేలుళ్లు సంభవించి 11 మంది మహిళా కూలీలు గాయాలపాలయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం శివారు జి.మేడపాడు గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
*మద్యం దుకాణాల నిర్వహణలో ప్రభుత్వ నిర్ల క్ష్యం తేటతెల్లమైంది. పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో దుకాణాల వద్ద ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, కృష్ణా జిల్లా గన్నవరంలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద తలెత్తిన ఘర్షణలో ఓ వ్యక్తి తలపగిలింది. నెల క్రితమే మద్యం దుకాణాలకు లైసెన్సుల గడువు ముగిసిపోవడంతో కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రభుత్వమే కానిస్టేబుళ్లను పెట్టి సర్కారు మద్యం దుకాణాన్ని నిర్వహిస్తోంది.
*అప్పుల బాధతో నాగర్కర్నూల్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బిజినేపల్లి మండలం పాలెంలో వెంకటయ్య(50) అప్పులు రూ.4 లక్షలకు చేరడంతో సోమవారం పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఊర్కొండ మండ లం రాచాలపల్లికి చెందిన ఎర్రబోయ వెంకటయ్య (50)కు అప్పులు రూ.5లక్షల వరకు పెరగడంతో శుక్రవారం పొలంలో విష గుళికలు మింగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు.
* కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద సోమవారం రాత్రి ఎస్ఎస్టీ (స్ట్రయికింగ్ సర్వీసులైన్ టీం) సభ్యుల తనిఖీల్లో రూ.10 లక్షల 80 వేల నగదు పట్టుబడింది.
*గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. అంబాజీ ప్రాంతంలో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సు స్కిడ్ అవడం వలే లోయలో పడినట్లు పేర్కొన్నారు.
*నీటిలో మునిగిపోతున్న సోదరుడిని కాపాడాలన్న తాపత్రయం అన్నాచెల్లెళ్లను బలిగొంది. ఈత రాకున్నా సాహసించి తమ్ముడిని కాపాడగలిగినా వారు మాత్రం అసువులు బాశారు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్లో సోమవారం చోటు చేసుకుంది
*కర్నూలులోని బుధవారపేటకు చెందిన ఆటో డ్రైవర్ మద్దిలేటి హత్య కేసు మిస్టరీ వీడింది. కర్నూలు మూడో పట్టణ పోలీసులు, సీసీఎస్ పోలీసులు కలిసి కేసు దర్యాప్తు చేపట్టి స్థానిక ముజఫర్నగర్కు చెందిన నలుగురు జేబు దొంగలు ఈ హత్యకు పాల్పడినట్లు తేల్చి అరెస్టు చేశారు.
*చైనాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19మంది సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎనిమిది మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఝేజియాంగ్ రాష్ట్రంలోని నింఘాయ్ ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
*చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు ఘటనాస్థలికి చేరుకొని పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడిన YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్.