Fashion

మచ్చలను మాయం చేసే అలోవెరా

Aloevera Helps Get Clear Skin-Telugu Fashion & Beauty Tips

చర్మం మెరిసిపోవాలనీ, జుట్టు నిగనిగలాడిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కనిపించిన ప్యాక్‌లు వేసుకుంటాం. క్రీములు రాసుకుంటాం. ఇవే కాదు… అందుబాటులో ఉండే సహజపదార్థాలు మన సౌందర్యాన్ని పెంచుతాయని మాత్రం గుర్తించం. అలాంటిదే కలబంద. దీన్నివాడితే ఎన్నో ప్రయోజనాలు…అవేంటంటే!

కలబంద గుజ్జు చేసి పెట్టుకోవాలి. దానికి సమాన పరిమాణంలో కొబ్బరినూనె, ఆముదం, కొన్ని మెంతులు అందులో వేసి మరిగించాలి. బాగా వేడయ్యాక తీసి చల్లార్చి ఓ డబ్బాలో భద్రపరుచుకోవాలి. దీన్ని తలస్నానం చేసే గంట ముందు జుట్టుకి పట్టించి మర్దన చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలకు తగిన పోషణ అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి.

ముఖంపై మచ్చలు తగ్గాలంటే… పావుకప్పు కలబంద గుజ్జులో కొద్దిగా తేనె, చెంచా తులసిపొడి కలపాలి. దాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని పావుగంట ఉంచి కడిగేసి నిద్రపోవాలి. ఇలా తరచూ చేస్తుంటే సమస్య దూరం అవుతుంది.