Business

గూగుల్ ఇండియాలో 3800 నూతన ఉద్యోగాలు

Google India Announces 3800 New Jobs-Telugu Business News

భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,800 మంది ఉద్యోగులను గూగుల్‌ 2020లో నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే తక్కువ జీతాలు ఇచ్చి థర్డ్‌పార్టీ ఉద్యోగులతో సంస్థను నడిపిస్తున్నట్లు విమర్శలు రావడంతో గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకొంది. భారత్‌లో గూగుల్‌ కస్టమర్‌ కేర్‌ సేవలను ఇక్కడి నుంచే అందిస్తోంది. ‘‘2020లో మేము విస్తరించనున్నాం. మిసిస్సిపీలో ఒక కార్యనిర్వహాక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము. భారత్‌, ఫిలిప్పీన్స్‌లో కూడా విస్తరణ జరుగుతుంది. మాకు ఇప్పటికే అందిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ విస్తరణ జరుగుతుంది. ఇప్పటికే గూగుల్‌ ఆపరేషన్‌ సెంటర్‌లో పనిచేస్తున్న 1,000 మంది ఏజెంట్లతో కలిపి మేము దాదాపు 4,800 కస్టమర్‌ కేర్‌ సపోర్ట్‌ ఉద్యోగాలను సృష్టిస్తాం’’ అని గూగుల్‌ ఆపరేషన్‌ సెంటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ట్రాయ్‌ డికెర్సన్‌ తెలిపారు.