ScienceAndTech

నేపాల్‌లో…సైబర్ నేరాలు చేస్తున్న 120 చైనీయుల ఖైదు

120 Chinese Cyber Criminals Arrested In Nepal

సైబర్‌ నేరాలకు పాల్పడిన కేసుల్లో నేపాల్‌లో 122 మంది చైనీయులు అరస్టైనట్లు చైనా ఓ ప్రకటనలో వెల్లడించింది. నిందితులు సరిహద్దు ప్రాంతాల్లో చైనా అధికారులతో భాగస్వామ్యమై సైబర్‌క్రైమ్స్‌కు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిపింది. ఖాట్మండ్‌ సరిహద్దులోని పలు ఇండ్లపై దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్‌ చేసి..500కుపైగా ల్యాప్‌టాప్స్‌ స్వాధీనం చేసుకున్నారని చైనా పేర్కొంది. నిందితులు బ్యాంకు నగదు లావాదేవీలు జరిపే యంత్రాలను హ్యాక్‌ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు ఖాట్మండ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఉత్తమ్‌ సుబేది తెలిపారు. ఎక్కువగా విదేశీయులే ఇలాంటి నేరాలకు పాల్పడుతూ పట్టుబడటం ఇది తొలిసారి అన్నారు. ఇరు దేశాల భద్రతాదళాలు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టి ఇండో-నేపాల్‌ సరిహద్దుల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్‌ చేసినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్‌ శుయాంగ్‌ మీడియాతో వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలు, సైబర్‌ నేరాలు అదుపు చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయన్నారు.