Movies

సోనాక్షి సంతృప్తి

Sonakshi Sinha Says Satisfied And Happy With This Year

ఇటీవలే దబాంగ్ 3 చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షిసిన్హా. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుండగా..సోనాక్షిసిన్హా పాత్రకు అభిమానుల నుంచి మరోసారి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ ఏడాది సోనాక్షిసిన్హా కు అదృష్టవశాత్తు బాగా కలిసొచ్చిందట. అదృష్టవశాత్తు నాకు కలంక్, ఖాందాని శఫఖానా, మిషన్ మంగళ్, దబాంగ్ 3 వంటి విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాల్లో నటించే అవకాశమొచ్చింది. ఓ నటిగా నాకు ఈ ఏడాది చాలా సంతృప్తికరంగా సాగింది. దబాంగ్ 3 విజయంతో ఈ ఏడాది అద్భుతంగా ముగుస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది సోనాక్షిసిన్హా.