‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీగా పాపులరైంది పాయల్ రాజ్పుత్. అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసి హాట్హాట్గా నటించేందుకు సిద్ధమన్న టాక్ ఆమెకు తొలి చిత్రంతోనే వచ్చింది. ఆతర్వాత ‘ఆర్డిఎక్స్ లవ్’ అనే మూవీలో నటించి మరోసారి అందాలు ఆరబోసింది. అయితే ఇటీవలే ‘వెంకీమామ’ లాంటి ఫ్యామిలీ సినిమాలో నటించినా ఆ చిత్రం తనకు ఏ మాత్రం ప్లస్ కావడం లేదు. ఈ చిత్రంలో ఆమె కాస్త పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా కనిపించినా కానీ యూత్లో మాత్రం హాట్ బ్యూటీ తరహా ఇమేజ్తో స్థిరపడిపోయింది. సరిగ్గా ఇదే పాయింట్ పాయల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎవరైనా ఆఫర్ ఇవ్వాలనుకున్నా.. తొలి రెండు చిత్రాలతో దక్కిన ఇమేజ్నే దృష్టిలో పెట్టుకుని తనకు కథలు వినిపిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉందట.అందుకే ఛేజారిన పరిస్థితిని తిరిగి అదుపులోకి తెచ్చేందుకు నానా ప్రయాసలకు గురవుతోందట. ప్రస్తుతం ‘డిస్కో రాజా’పైనే ఈ బ్యూటీ ఆశలన్నీ. ఈ చిత్రం తనకు మరో కొత్త గుర్తింపును ఇవ్వాల్సి ఉంటుంది. అలా జరగకపోతే మళ్లీ ఇబ్బంది తప్పదు. ఫ్యామిలీ సినిమాలకు సూట్ కాదు.. బోల్డ్ గ్లామర్ గర్ల్ పాత్రలకే సరిపోతుంది! అన్న ఇమేజ్ స్థిరపడిపోతే అటుపై కేవలం అలాంటి సినిమాలకే పరిమితం కావాల్సి ఉంటుందన్న భయం ఆమెను వెంటాడుతోందట. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఏదైనా మాస్టర్ ప్లాన్ వేయాలని చూస్తోందట.
పాయల్ కష్టాలు

Related tags :