Devotional

Telugu horoscope – Apr 27 2024

Telugu horoscope – Apr 27 2024

మేషం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

వృషభం: యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

కర్కాటకం: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

సింహం: రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ఆటంకాలు. మిత్రులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

కన్య: బంధువుల తోడ్పాటు అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ధనలాభం. కార్యసిద్ధి. పోటీపరీక్షల్లో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z