NRI-NRT

తెలుగుదనం ప్రతిబింబించిన టాంటెక్స్ ఉగాది

తెలుగుదనం ప్రతిబింబించిన టాంటెక్స్ ఉగాది

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) 2024 క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో హై స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. తన్మయీ రాయపాటి బృందం అమెరికా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. టాంటెక్సు అధ్యక్షుడు సతీష్ బండారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వరదరాజన్ పంచాంగశ్రవణం చేశారు.

కల్చరల్ కమిటీ ఛైర్ పర్సన్ దీపికా రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ఫ్రిస్కో నగర కౌన్సిల్ మెంబర్లు జాన్ కీటింగ్, ఏంజెలియ పెల్ హ్యాం, ఫ్రిస్కో ఐ యస్ డీ బోర్డు ఆఫ్ ట్రస్టీ గోపాల్ పోణంగి అతిథులుగా హాజరయ్యారు. దయాకర్ మాడా హాస్యవల్లరి స్కిట్, చిన్నారులు ,మహిళలు ప్రదర్శించిన “మూషిక వాహన” క్లాసికల్ నృత్యం, పల్లెల్లో ఉగాది పండుగ రూపకం, శివభక్తిని ప్రతిబింబించే నృత్యాలు, అన్నమాచార్య కీర్తన “చక్కని తల్లికి” క్లాసికల్ నృత్యం, గాయకులు మాళవిక, కారుణ్యల చలనచిత్ర గానం, మెహర్ చంటి లైవ్ బ్యాండ్, చంద్రిక యామిజాల శిష్యుల రామాయణ బాలరూపకం, రోబో గణేశన్ ప్రదర్శనలు అలరించాయి. టీవీ సీరియల్స్ దర్శకుడు లింగాల సంజీవరెడ్డి, “హీల్” స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాక్టర్ కృష్ణబాబు చుండూరి, కూచిపూడి కళాకారిణి కల్యాణి ఆవుల, ఇంజినీరు సత్యం కళ్యాణ్ దుర్గ్, కథకుడు-పాటకుడు తనికెళ్ళ శంకర్, తేజస్విని కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తేజస్వి సుధాకర్ తదితరులను సత్కరించారు. రాజేష్ శొంఠి తెలుగు విందు భోజన ఏర్పాట్లను సమన్వయపరిచారు.

రవి తూపురాని, మైత్రేయి మియపురం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈవెంట్ కోఆర్డినేటర్ దీప్తి సూర్యదేవర, టాంటెక్స్ సంస్థ పూర్వ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, టాంటెక్స్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ యు.నరసింహారెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చిన్నసత్యం వీర్నాపు, మూర్తి ములుకుట్ల, డాక్టర్ పుదూరు జగదీశ్వరన్, దయాకర్ మాడా, లెనిన్ వేముల, కిరణ్మయి గుంట, బసాబత్తిన శ్రీనివాసులు, యర్రం శరత్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి పొట్టిపాటి, మాధవి లోకిరెడ్డి, ప్రవీణ్ బాలిరెడ్డి, ఉదయ్ కిరణ్ నిడిగంటి, సునీల్ సురపురాజు, లక్ష్మి నరసింహ పోపూరి, నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి, నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టరు రాజేంద్ర మాదాల, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల, ప్రసాద్ జోస్యుల తదితరులు పాల్గొన్నారు. 2024 బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ సురేష్ మండువ, ఉపాధ్యక్షుడు హరి సింగం అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z