NRI-NRT

ఉల్లాసంగా సాగుతోన్న ఆటా “సయ్యంది పాదం”

ఉల్లాసంగా సాగుతోన్న ఆటా “సయ్యంది పాదం”

జూన్ 7 నుండి 9వ తేదీ వరకు అట్లాంటాలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో 18వ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికావ్యాప్తంగా “సయ్యంది పాదం” పేరిట డ్యాన్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానం పొందిన ప్రవాస యువతీ యువకులు, చిన్నారులకు ఆటా సభల వేదికపై తుదిపోరులో తలపడేందుకు అవకాశం కల్పిస్తామని అధ్యక్షురాలు బొమ్మకంటి మధు, కన్వీనర్ పాశం కిరణ్‌లు తెలిపారు.

లాస్ ఏంజెల్స్, నాష్ విల్, రాలీ, అట్లాంటా, డల్లాస్, న్యూ జెర్సీ, ఆస్టిన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డిసి, షార్లెట్, చికాగో నగరాల్లో ఇప్పటికే పూర్తి అయిన ఈ పోటీలు మరిన్ని అమెరికా నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 7 నుండి 13 సంవత్సరాల వారు జూనియర్ల విభాగంలో, 14 ఆపై వారు సీనియర్ల విభాగంలో క్లాసికల్, నాన్ క్లాసికల్, సోలో, గ్రూప్ వంటి విభిన్న పోటీలలో తమ సత్తా చాటుతున్నారు.

“సయ్యంది పాదం” కార్యక్రమ ఛైర్ శృతి చిట్టూరి, కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ, అడ్వైజర్ రాజు కాకర్ల, కో ఛైర్ వాణి గడ్డం, మెంబర్లు గౌరీ కారుమంచి, రజనీకాంత్ దాడి, చిట్టి అడబాల, అట్లాంటా నుంచి సందీప్ రెడ్డి, నీలిమ గడ్డమణుగు, కిషన్ దేవునూరి, ఉదయ ఈటూరి, శ్రావణి రాచకుళ్ల, మాధవి దాస్యం, జయచంద్రా రెడ్డి, నిరంజన్ పొద్దుటూరి, గణేష్ కాసం, రాలీ నుంచి శృతి ఛామల, రాధా కంచర్ల, కీర్తి ఎర్రబెల్లి, అజిత చీకటి, పవిత్ర రత్నావత్, షాలిని కల్వకుంట్ల, శ్రీదేవి కటిక, రజని త్రిపురారి, నాష్ విల్ నుంచి రామకృష్ణా రెడ్డి అల, కిశోర్ గూడూరు, నరేంద్ర నూకల, సుశీల్ చండ, క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండ, లావణ్య నూకల, బిందు మాధవి చండ, షార్లెట్ నుండి వెంకట రంగారెడ్డి సబ్బసాని, క్రాంతి ఏళ్ళ, సునీత నూకల తదితరులు పోటీల నిర్వహణకు సహకరించారు.

వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z