WorldWonders

42అడుగుల గోళ్లకు గిన్నీస్ రికార్డు-NewsRoundup-May 25 2024

42అడుగుల గోళ్లకు గిన్నీస్ రికార్డు-NewsRoundup-May 25 2024

* అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ (Diana Armstrong) అనే మహిళ గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డును (Guinness World Record) సొంతం చేసుకున్నారు. ఆమె చేతి వేళ్లకు 1,306.58 సెం.మీ (42 అడుగుల 10.4 అంగుళాల) పొడవైన గోళ్లు ఉన్నట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. ఆమె 25 ఏళ్లుగా తన గోళ్లను పెంచుతోందని, అవి మినీ స్కూల్‌ బస్సు కంటే పొడవుగా ఉన్నాయని వారు తెలిపారు.

* లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి ఓటమి ఖాయమని.. దీనికి మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను కాంగ్రెస్‌ (Congress) బలిపశువును చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. అనంతరం ఆ పార్టీ ‘రాచకుటుంబం’ విదేశీ పర్యటనలకు వెళ్లిపోతుందని తెలిపారు. బిహార్‌లోని కారాకాట్‌, పాటలీపుత్రల్లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచార సభల్లో మోదీ పాల్గొని, ప్రసంగించారు. ‘ఇండియా’ కూటమి తన దాస్యాన్ని చాటుతూ.. ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు వారిముందు ముజ్రా (నృత్యం) చేస్తోందని ఆరోపించారు.

*

* ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ జరగనుంది. భారాస ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.

* భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివారని ప్రచారం చేస్తున్న నాయకులు ఆ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ కళాశాల వారే పట్టభద్రులు.. మిగిలిన వారు కాదన్నట్లుగా మాట్లాడటం సరి కాదు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.

* బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తన తాజా సినిమా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

* తొలి క్వాలిఫయర్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకొనే మంచి అవకాశం హైదరాబాద్‌ ఎదుట నిలిచింది. ఇదే సీజన్‌లో కోల్‌కతా చేతిలో రెండుసార్లు ఎదురైన పరాభవాలకు ‘ఫైనల్‌’ విజయంతో చెక్ పెట్టేందుకు సన్‌రైజర్స్ సిద్ధమవుతోంది. ఆదివారం ‘చెపాక్‌’ వేదికగా కోల్‌కతా – హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్ 17వ ఎడిషన్‌ టైటిల్‌ పోరు జరగనుంది.

* భారతదేశ సార్వత్రిక ఎన్నికలు, దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చిన పాకిస్థాన్‌ ఎంపీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మా వ్యవహారాల్లో తల దూర్చకుండా.. మీ దేశం సంగతి మీరు చూసుకోండి’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. మీ మద్దతు ఏం అక్కర్లేదంటూ హితవు పలికారు.

* కర్ణాటకలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్డుపై హల్‌చల్‌ చేశారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. మే 18న ఉడుపి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన (Group Fight in Karnataka)కు సంబంధించిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video)గా మారాయి.

* తెలియని, కొత్త ప్రదేశాలకు వెళ్తున్న సమయంలో సాధారణంగా ప్రజలు తమ గమ్య స్థానాలను చేరుకోవడానికి గూగుల్‌ మ్యాప్స్‌ (Google maps)ను ఉపయోగిస్తారు. కాని ఒక్కోసారి తప్పు దారులను చూపించడంతో ప్రమాదాల బారిన పడ్డవారు చాలామందే ఉన్నారు. జీపీఎస్‌ కనెక్టివిటీ, సాంకేతిక లోపాల కారణంగా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశముంటుంది.

* వేసవిలో రాత్రి మిద్దెపైన లేదా ఆరుబయలు ప్రదేశంలో కూర్చొని ఆకాశం వైపు చూస్తే వేలాది నక్షత్రాలు (Stars) కనిపిస్తుంటాయి. ఈ తారలు మన పాలపుంతకు చాలా దూరంలో ఉంటాయి. వీటి వద్దకు చేరాలంటే ప్రస్తుతమున్న అత్యంత వేగవంతమైన రాకెట్ల సాయంతో వెళ్లినా వేల సంవత్సరాలు పడుతుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z