NRI-NRT

కింజరపు-పెమ్మసానిలకు మన్నవ మోహనకృష్ణ శుభాకాంక్షలు

Mannava Mohanakrishna Congratulates Pemmasani and Kinjarapu

తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ ఏపీ నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరపు రామ్మోహన్‌నాయుడు, డా. పెమ్మసాని చంద్రశేఖర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ స్థాయి నుండి కష్టించి, విజయతీరాలు అందుకుని నేడు యావత్ భారత ప్రజల సంక్షేమం కోసం పాటుపడేందుకు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన వారి ఇరువురితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో చాలాకాలంగా పెమ్మసానితో తనకు స్నేహబంధం ఉందని ఆయన నూతన పదవిలో రాణించాలని ఆకాంక్షించారు. సిక్కోలు చిన్నోడు కింజరపు కూడా ఢిల్లీలో తండ్రిని మించిన తనయుడిగా ఎదగాలని ఆకాంక్షించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z