NRI-NRT

నాట్స్ ఫీనిక్స్ విభాగం ప్రారంభం

నాట్స్ ఫీనిక్స్ విభాగం ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ ఫీనిక్స్ విభాగాన్ని ప్రారంభించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాహుల్ కోనే ఫినిక్స్ చాప్టర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. నాగ పడమట నాయకత్వంలో ఈ ఫినిక్స్ చాప్టర్ ముందుకు సాగనుంది. సతీశ్ గంధం, వేణు దమరచద్, కిషోర్ రావు కోదాటి, అభిలు ఫినిక్స్ చాప్టర్ సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటిలు ఫినిక్స్‌లో జరిగిన చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఫినిక్స్ నాట్స్ విభాగ నాయకులను అభినందించారు. ఫినిక్స్‌లో నాట్స్ కార్యక్రమాలను ముమ్మరంగా చేసేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ బోర్డ్ అందిస్తుందని ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. నాట్స్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వాలంటీర్లకు నాట్స్‌లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. రవి కొమ్మినేని, వెంకటేష్ ఏనుగుల, ప్రవీణ్ రెడ్డి పాటి సహకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z