NRI-NRT

డెట్రాయిట్‌లో తెదేపా సంబరాలు

NRI TDP Janasena Victory Celebrations In Detroit

తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో 2024 ఎన్నికల్ ఫలితాల విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సెయింట్ తోమా చర్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నిరంజన్ శృంగవరపు కేక్ కట్ చేశారు. ఆలపాటి రాజా, సీ.ఎం.రమేష్, పెమ్మసాని చంద్రశేఖర్‌లు వీడియో ద్వారా ప్రవాసులతో ముచ్చటించి ధన్యవాదాలు తెలిపారు. జనసేన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డా. కొడాలి శ్రీనివాస్, రావి కుటుంబరావు, చిలుకూరి రాంప్రసాద్, పెద్దిబోయిన జోగేశ్వరరావు, వంశీ వెల్లంకి, ఉదయ చాపలమడుగు, గుత్తా వెంకట్, నాదెళ్ల గంగాధర్, డా. వడ్లమూడి బాబు, డా. రాఘవేంద్ర చౌదరి, సజ్జా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z