NRI-NRT

Day1_AM: సెయింట్ లూయిస్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Day1: సెయింట్ లూయిస్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో స్థానిక హిందూ దేవాలయంలో మే 24 నుండి 28వ తేదీ వరకు 5రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం నాడు బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు చేశారు. తొలిరోజు ఉదయం కార్యక్రమాల్లో విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, పంచగవ్య ప్రసన్నం, అగ్ని ప్రతిష్ఠ, అకల్మష హోమం, యాగశాల వాస్తు హోమం, పూర్ణాహుతి, గోమాత పూజ, హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. నేటి సాయంత్రం రుత్విక్ వారణం, రక్షాబంధనం, మేదిని పూజ, అంకురార్పణ తదితర పూజలు నిర్వహించనున్నారు. వీటితో పాటు అయిదు రోజుల పాటు ప్రతి రోజు ప్రత్యేక హోమాలు, పూజలు, అలంకారాలు, సుప్రభాతం,తోమాల సేవ,తిరు ఆరాధనఒ,వుక్త (గరుడ) హోమఒ,ధ్వజారోహణ,అజస్వ దీపారాధనం అంకురార్పణ,నవ కుంభరోహణం,వుక్తా హోమఒ, శేష వాహన సేవ, కుంభారాదనం,హనుమంత వాహన సేవ,గరుడ వాహన సేవ,శ్రీనివాస కళ్యాణం, గజవాహన సేవ వంటి క్రతువులను కూడా నిర్వహిస్తున్నారు.

శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ఈ అయిదు రోజుల క్రతువు మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి దోహదపడేలా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. బ్రహ్మోత్సవం అనేది హిందూ ధార్మిక పరిణతిలో ఒక ప్రముఖమైన ఉత్సవమని, దేవతల కృప భక్తులకు సమృద్ధిగా లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ కమిటె అధ్యక్షుడు విజయ్ కె. సాక్షి, బ్రహ్మోత్సవాల కార్యదర్శి పుట్టగుంట మురళీ తదితరుల సమన్వయంలో 500 మంది వాలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేస్తున్నారు

బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన కార్యక్రమాలు:

* ధ్వజారోహణం: బ్రహ్మోత్సవం ప్రారంభం రోజు ధ్వజారోహణం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభంపై పవిత్రమైన పతాకను ఎగరవేస్తారు

* వాహన సేవలు: ప్రతిరోజు దేవతలను ప్రత్యేక వాహనాలపై ఊరేగించడం బ్రహ్మోత్సవంలో ముఖ్యమైన కార్యక్రమం గరుడ వాహనం,హంస వాహనం,రథం వంటి వాహనాలపై దేవతలను ఊరేగిస్తారు

* స్వపన తిరుమంజనం: దేవతలను పవిత్ర జనాలతో అభిషేకించడం ఇది భక్తులు విశేషంగా ఆకర్షిస్తుంది

* చక్రస్నానం: బ్రహ్మోత్సవం చివరి రోజు చక్రస్నానం నిర్వహిస్తారు ఇందులో చక్ర తల్వార్ను పవిత్ర జనాలతో స్నానం చేయించడం జరుగుతుంది.ఇందులో చక్రతాల్వార్ను పవిత్ర జలాల్లో స్థానం చేయించడం జరుగుతుంది.

ప్రత్యక్షంగా ఈ వేడుకల్లో పాల్గొనలేని భక్తులు ఈ దిగువ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావచ్చునని మీడియా చైర్ పర్సన్ రాజా సురపనేని తెలిపారు.

https://www.youtube.com/live/f1lBjB-lp30[\embed]

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z