NRI-NRT

టాంటెక్స్ 202వ సాహిత్య సదస్సులో “పద్య రచనల పట్టు విడుపులు”పై చర్చ

టాంటెక్స్ 202వ సాహిత్య సదస్సులో “పద్య రచనల పట్టు విడుపులు”పై చర్చ

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు లెనిన్ వేముల గృహంలో 202వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు నిర్వహించారు. “పద్య రచనల పట్టు విడుపులు” అనే అంశంపై చ్రించారు. పురందర దాసు కన్నడ భక్తి గేయం ఒల్లనో హరి కొల్లనో కీర్తనను సమన్విత ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డా.యు.నరసింహారెడ్డి మన తెలుగు సిరి సంపదలు శీర్షికలో పలు తెలుగు వ్యాకరణ ప్రక్రియలను వైవిద్యభరితంగా వివరించారు. విశ్రాంత ఆచార్యులు బి.లలితానంద ప్రసాద్, SBI విశ్రాంత ఉద్యోగి గుళ్ళపల్లి రాజేంద్రప్రసాద్‌లు స్వీయ కవితలు చదివి వినిపించారు. లెనిన్ వేముల జాషువా “శ్మశానవాటిక”లోని పద్యాలను ఆలపించి వివరించారు.

కొప్పరపు సూర్య ప్రకాశరావు శర్మ ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడుతూ ఛందస్సుతో పద్య రచనపై తాను రచించిన “పద్యరచనామృతబోధిని” పుస్తకం గూర్చి వివరించారు. ముద్దు బాలంభట్టు విరచిత “మంథెన్న రామాయణము”, గరికపాటి నరసింహారావు “సాగర ఘోష”, నరాల రామిరెడ్డి, పార్వతీశ్వర శర్మ, ఎం రవిశర్మ వ్రాసిన పద్యాలను విశ్లేషించారు. టాంటెక్స్ అధ్యక్షుడు సతీష్ బండారు నేతృత్వంలోని కార్యవర్గం ముక్య అతిథిని సత్కరించి “పద్య శంకర” బిరుదును ప్రదానం చేశారు. టాంటెక్స్ సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కొమరవోలు సరోజ, చినసత్యం వీర్నాపు, దయాకర్ మాడా, ఎం.వీ.లోకనాధం, గోవర్ధనరావు నిడిగంటి, నంద, విజయలక్ష్మి, మావిళ్ల రంగయ్య, కిరణ్మయి, గౌతమీ, సమన్వయకర్త లక్ష్మినరసింహ పోపూరి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z