Food

కాలేయాన్ని ఇబ్బంది పెట్టని ఆహారం ఇది

Liver Healthy Food And Diet News

మన బాడీలో మంచి, చెడు రెండూ జరుగుతుంటాయి. వాటి ప్రభావం ఎక్కువగా లివర్ పైనే పడుతుంది. ఎందుకంటే అది దాదాపు 700 రకాల పనులు జరిగేందుకు కారణమవుతోంది. రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ… లివర్ (కాలేయం)… విష వ్యర్థాల్ని బయటకు పంపేస్తుంది. కాబట్టి మనం లివర్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. గుండె ఎంత ముఖ్యమో… లివర్ కూడా అంతే ముఖ్యమని అనుకోవాలి. కానీ దురదృష్టవశాత్తూ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆల్కహాల్, పొల్యూషన్, స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ (తాగేవాళ్లు వదిలే పొగను పీల్చే పరిస్థితి), సరైన ఆహారం తినకపోవడం, ఒత్తిళ్లు, టెన్షన్లు అన్నీ కలిసి… లివర్‌ను వీక్ చేసేస్తున్నాయి. విషాల్ని తొలగించాల్సిన లివరే… విషపూరితమైపోతోంది. అందుకే మనం లివర్‌ను కాపాడుకునే ఆహారాన్ని తినాలి.

Curcumin (పసుపు) – పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. అది లివర్‌ని కాపాడే ఎంజైముల ఉత్పత్తిని పెంచుతుంది. లివర్‌ని క్లీన్ చేసే బైల్ ఎంజైమ్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. లివర్ కాన్సర్ రాకుండా ఉండాలంటే కూడా పసుపు వాడాలి. అందుకే మన వంటల్లో పసుపు మస్ట్‌గా వేస్తారు.

Garlic (వెల్లుల్లి) – ఇది చేదుగా ఉంటుందనీ, దీన్ని తింటే బాడీ నుంచీ చెడు వాసనలు వస్తాయనీ అనుకుంటూ చాలా మంది వెల్లుల్లిని వాడరు. అది ఎంత మాత్రం మంచిది కాదు. లివర్‌ను పరిశుభ్రం చేసే గుణం వెల్లుల్లికి ఉంది. రోజూ వెల్లుల్లి వాడితే… మీ లివర్ అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల ఇతర ఆలోచనలు పక్కన పెట్టేసి… రోజూ ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కర్రీలో వేసేసుకోండి.

Lemon (నిమ్మ) – నిమ్మ మనం ఎలాగూ ఎండాకాలంలో వాడుతూనే ఉంటాం. వర్షాకాలం, చలికాలంలో కూడా వాడాలి. ఎందుకంటే ఇందులోని విటమిన్ C… లివర్ కణాలు పాడవకుండా కాపాడుతుంది. లివర్‌ను కాపాడే కవచం లాంటిది నిమ్మకాయ. ప్రతి వ్యక్తీ రోజుకో నిమ్మకాయను వాడొచ్చు. అంతకంటే ఎక్కువ మాత్రం వాడకూడదు.

Coriander (కొత్తిమీర) – ఈ రోజుల్లో కొత్తి మీర ధర బాగా పెరిగింది. అయినప్పటికీ దానికి ఉండే మంచి గుణాలు దానికి ఉన్నాయి. అందులోని ఫైటోకెమికల్స్… సైనికుల్లా ఫైట్ చేస్తూ… లివర్‌ని కాన్సర్ల నుంచీ కాపాడతాయి. కాబట్టి తాజా కొత్తిమీరను వాడండి… మేలు జరుగుతుంది.

Leafy greens (ఆకుకూరలు) – తాజా ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది. ముఖ్యంగా పుదీనా, మెంతి కూర, ఆవాల కూర, తోటకూర, గోంగూర ఇలాంటి ఆకుకూరలు తిన్నారంటే… మీ లివర్ మిమ్మల్ని తెగ ఇష్టపడుతుంది. ఎండల్లో ఫ్రూట్ జ్యూస్ ఇచ్చినట్లు ఫీలవుతుంది.

Sleep at the right time – చక్కగా నిద్రపోతే… మెలటోనిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అర్థరాత్రికి ముందే అంటే రాత్రి 10 గంటల్లోపే నిద్రలోకి జారుకుంటే… మెలటోనిన్ హార్మోన్… లివర్‌ను మెరుగుపరుస్తుంది. కాబట్టి నిద్రపోవడాన్ని మర్చిపోవద్దు.

Radish (ముల్లంగి) – ఇది కూడా మంచిది. లివర్‌ను కాపాడుతుంది. ముల్లంగి జ్యూస్ తాగితే… లివర్ ఖుషీ అయిపోతుంది. పాడైన లివర్‌ని కూడా బాగుచేసే శక్తి దీనికి ఉంది.

పై వాటిలో కొన్నింటిని ఆల్రెడీ మీరు వాడుతూనే ఉండొచ్చు. మిగతా వాటిని కూడా మైండ్‌లో పెట్టుకొని వీలైనంతగా వాడేస్తూ ఉంటే… ఆరోగ్యం మెరుగవుతుంది, లివర్ కూడా చక్కగా పనిచేస్తుంది.